విషాదం: ఒకే కుటుంబంలో ఐదుగురి అనుమానాస్పద మృతి

Published : Mar 07, 2021, 11:56 AM IST
విషాదం: ఒకే కుటుంబంలో ఐదుగురి అనుమానాస్పద మృతి

సారాంశం

ఛత్తీస్‌ఘడ్ లోని దుర్గ్ జిల్లాలో ఒకే ఇంట్లో ఐదుగురు అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతోంది.

రాయ్‌పూర్:ఛత్తీస్‌ఘడ్ లోని దుర్గ్ జిల్లాలో ఒకే ఇంట్లో ఐదుగురు అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతోంది.

దుర్గ్ జిల్లాలోని బతేనా గ్రామంలో శనివారం నాడు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదస్థితిలో మరణించారు. కుటుంబ యజమాని ఆయన కొడుకు ఒకే తాడుకు ఉరేసుకొన్నారు. అతడి భార్య, ఇద్దరు కూతుళ్లు  మృతదేహాలు ఇంటి బయట ఉన్న ఎండుగడ్డిపై పూర్తిగా కాలిపోయి ఉన్నాయి.

సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్స్, ఫోరెన్సిక్ బృందాలు ఆధారాల కోసం పరిశీలిస్తున్నాయి.  మరణించినవారిని రామ్ బ్రిజీ గైక్వాడ్ ఆయన భార్య జానకిబాయి, కొడుకు సంజ్ గైక్వాడ్, కూతుళ్లు దుర్గ, జ్యోతిలుగా గుర్తించారు. దుర్గ్ జిల్లాలోని భతేనా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

భార్య, ఇద్దరు కూతుళ్లను చంపిన ఎండు గడ్డిలో వారి మృతదేహాలను తండ్రి కొడుకులు కాల్చినట్టుగా సంఘటన స్థలాన్ని చూస్తే అర్హమౌతోందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఈ ఐదుగురు ఆత్మహత్య చేసుకొన్నారని దుర్గ్ రేంజ్ ఐజీ వివేకానంద్  సిన్హా తెలిపారు. ఈ మేరకు తాము ఓ సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకొన్నామన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?