కరోనా నుండి కోలుకొని అదే ఆసుపత్రి వద్ద వలంటీర్లు

By narsimha lode  |  First Published Apr 12, 2020, 3:37 PM IST

కరోనా వైరస్ సోకి వ్యాధి నయమైన  ఐదుగురు తాము చికిత్స తీసుకొన్న ఆసుపత్రిలోనే వలంటీర్లుగా పనిచేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.
 


అహ్మాదాబాద్: కరోనా వైరస్ సోకి వ్యాధి నయమైన  ఐదుగురు తాము చికిత్స తీసుకొన్న ఆసుపత్రిలోనే వలంటీర్లుగా పనిచేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.

అహ్మదాబాద్ లో కరోనా సోకి నయమైన ఐదుగురిని ప్రభుత్వాసుపత్రి వద్ద వలంటీర్లుగా నియమించారు మున్సిపల్ అధికారులు. వైరస్ నుండి కోలుకొన్న రోగులకు సాధారణ మనుషుల కంటె రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని అధికారులు.  అత్యవసరమైన పేషెంట్లకు ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడకూడదనే ఈ ప్రత్యేక కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్టుగా  మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా చెప్పారు.

Latest Videos

అహ్మదాబాద్‌లో 243 కరోనా పాజిటివ్ కేసులు నమోవదయ్యాయి. మూడు రోజుల నుండి 159 కేసులు నమోదయ్యాయి. శనివారం నాడు ఒక్కరోజే 46 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా అధికారులు తెలిపారు.

also read:లాక్‌డౌన్ ఉల్లంఘన: ప్రశ్నించిన పోలీసులపై కత్తులతో దాడి

కరోనా నుండి కోలుకొన్న ఏడుగురు రోగులు కూడ స్వచ్చంధంగా ఆసుపత్రుల వద్ద వలంటీర్లుగా పనిచేసేందుకు ముందుకు వచ్చినట్టుగా మున్సిపల్ అధికారులు తెలిపారు.ఆసుపత్రుల వద్ద పనిచేసేందుకు వచ్చిన వారికి పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

దేశంలో ఆదివారం నాటికి 8356 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కసులు నమోదైనట్టుగా రికార్డులు చెబుతున్నాయి.

click me!