త్రిపుర ఎన్నికల పోలింగ్ కు ముందు బాంబు పేలుడు క‌ల‌క‌లం.. అగర్తలలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌

Published : Feb 16, 2023, 12:21 PM IST
త్రిపుర ఎన్నికల పోలింగ్ కు ముందు బాంబు పేలుడు క‌ల‌క‌లం..  అగర్తలలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌

సారాంశం

Agartala: 60 మంది సభ్యులున్న త్రిపుర అసెంబ్లీకి స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, శాంతియుత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) గిట్టె కిరణ్ కుమార్ దినకర్రో తెలిపారు. గురువారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో పోలింగ్ ప్రారంభ‌మైంది.  

Tripura Assembly Election 2023: త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ గురువారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప్రారంభ‌మైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 28.14 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో 14,15,233 మంది పురుష ఓటర్లు, 13,99,289 మంది మహిళా ఓటర్లు, 62 మంది థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3,337 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది.

అయితే, త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కు ముందు రాష్ట్ర రాజ‌ధాని అగ‌ర్త‌ల‌లో బాంబు పేలుడు క‌ల‌క‌లం రేపింది. బాంబు పేలుడు నేప‌థ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. అగ‌ర్త‌లలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. త్రిపుర రాజధాని అగర్తల సమీపంలోని బిషాల్‌ఘర్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. రాత్రి తమ ఇంటి బయట బాంబు విసిరారని సీపీఎం మద్దతుదారు కుటుంబం పేర్కొంది. ఇందుకు బీజేపీ మద్దతుదారులే కారణమని ఆరోపించింది. దీంతో త్రిపుర రాజధాని అగర్తలలో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ క‌ట్టుదిట్ట‌మైన‌ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని స్థానిక పోలీసులు తెలిపారు. 

కాగా, 60 మంది సభ్యులున్న త్రిపుర అసెంబ్లీకి స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, శాంతియుత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) గిట్టె కిరణ్ కుమార్ దినకర్రో తెలిపారు. 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతుందని, వీటిలో 1,100 సున్నితమైనవి, 28 సమస్యాత్మకమైనవిగా గుర్తించామని ఆయ‌న‌ తెలిపారు. అలాగే, రాష్ట్రంలో మొత్తం 97 మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటి ప‌రిధిలో 18-19 ఏళ్ల వారు 94,815 మంది ఓట‌ర్లు, 22-29 ఏళ్ల వారు 6,21,505 మంది ఉన్నారు. అత్యధికంగా 40-59 ఏళ్ల మధ్య వయస్కులు 9,81,089 మంది ఉన్నారు.60 అసెంబ్లీ స్థానాల్లో 259 మంది అభ్యర్థుల భవితవ్యం త్వ‌ర‌లోనే తేలనుంది.

ఈ ఏడాది ఎన్నికలు జరిగిన తొలి రాష్ట్రంగా త్రిపుర నిలిచింది. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం