రైతు వేషంలో మంత్రి.. షాపు యజమాని నిర్లక్ష్యపు సమాధానం: ఆ తర్వాత

By Siva KodatiFirst Published Jun 22, 2020, 8:19 PM IST
Highlights

ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు మారువేషంలో జనం మధ్యంలోకి వెళ్లి.. అక్కడ జరుగుతున్న అక్రమాలను తెలుసుకోవడాన్ని మనం సినిమాల్లోనే చూసుంటాం. అయితే అచ్చం సినిమా సీన్‌ను తలపించేలా ఓ మంత్రి రైతు వేషంలో వెళ్లి ఎరువుల షాపు యజమాని పనిపట్టారు. 

వివరాల్లోకి వెళితే... ఎరువుల షాపుల్లో జరుగుతున్న అక్రమాలు మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దాదాజి భూసే దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి సంగతి చూడాలని భావించిన మంత్రి ఆదివారం రైతు వేషంలో ఔరంగాబాద్‌లోని ఎరువుల షాపులపై తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ షాపు దగ్గరకు వెళ్లి 10 బస్తాల యూరియా కావాలని అడిగారు. అయితే షాపు యజమాని ఎరువుల నిల్వలు ఉన్నప్పటికీ లేవని సమాధానం ఇచ్చాడు. స్టాక్ రిజిస్టర్ చూపించమని అడిగితే ఇంట్లో మర్చిపోయానని చెప్పాడు.

దీంతో ఆగ్రహించిన దాదాజి భూసే షాపులో సోదాలు నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో  పంచనామా నిర్వహించిన పోలీసులు దాదాపు 1,300 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ... క్వాలిటీ కంట్రోల్ అధికారులు సక్రమంగా పనిచేయాలని అలా అయితేనే రైతులు ఇబ్బందులు పడరని తెలిపారు.
 
click me!