చితకబాది.. మంచంపై విసిరి: 54 రోజుల పసిబిడ్డపై కన్నతండ్రి రాక్షసత్వం

Siva Kodati |  
Published : Jun 22, 2020, 06:25 PM IST
చితకబాది.. మంచంపై విసిరి: 54 రోజుల పసిబిడ్డపై కన్నతండ్రి రాక్షసత్వం

సారాంశం

మద్యం మనిషిని మృగంలా మారుస్తుంది. ఈ నేపథ్యంలో పీకలదాకా తాగిన ఓ కన్నతండ్రి.. రోజుల పసిబిడ్డపై దాడి చేయడంతో ఆ చిన్నారి ఆసుపత్రిలో విషమ పరిస్ధితుల్లో ఉంది

మద్యం మనిషిని మృగంలా మారుస్తుంది. ఈ నేపథ్యంలో పీకలదాకా తాగిన ఓ కన్నతండ్రి.. రోజుల పసిబిడ్డపై దాడి చేయడంతో ఆ చిన్నారి ఆసుపత్రిలో విషమ పరిస్ధితుల్లో ఉంది.

వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 40 ఏళ్ల షైజు థామస్ అనే వ్యక్తి భార్య రెండు నెలల క్రితం ఆడబిడ్డను ప్రసవించింది. ఈ క్రమంలో ఆదివారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన థామస్... 54 రోజుల సొంత బిడ్డను విపరీతంగా కొట్టి, మంచంపై పడేశాడు.

దీంతో ఆ చిన్నారి తీవ్రగాయాల పాలైంది. ఆ తర్వాత తేరుకుని తన కూతురు ప్రమాదవశాత్తూ మంచంపై నుంచి కిందపడిందని చెప్పి ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే బాలిక పరిస్ధితికి అతను చెప్పిన మాటలకు పొంతన లేకపోవడంతో వైద్యులకు అనుమానం కలిగింది.

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి గిన పోలీసులు థామస్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌లోనే తమదైన శైలిలో విచారించడంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..