స్నేహితుడు మరణించాడని అంత్యక్రియలకు వచ్చిన అఘోర.. మృతదేహంపై కూర్చుని పూజలు చేయడంతో..

Published : May 31, 2023, 07:44 AM IST
స్నేహితుడు మరణించాడని అంత్యక్రియలకు వచ్చిన అఘోర.. మృతదేహంపై కూర్చుని పూజలు చేయడంతో..

సారాంశం

మృతదేహంపై కూర్చొని ఓ అఘోర పూజలు చేయడం చర్చనీయాంశం అయ్యింది. స్నేహితుడు చనిపోయాడనే విషయం తెలియడంతో అంత్యక్రియల కోసం వచ్చిన అఘోర ఇలా పూజలు చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

చిన్ననాటి స్నేహితుడు చనిపోయాడని తెలిసి ఓ అఘోర అంత్యక్రియల కోసం వచ్చాడు. మృతదేహంపై కూర్చొని పూజలు చేశాడు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా సూలూర్ లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

విషాదం..హైవోల్టేజీ వల్ల పేలిన ఏసీ.. మహిళ మృతి, కుమారుడికి అస్వస్థత..

సూలూర్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న కురుంబపాళెయంలో మణికంఠన్‌ అనే వ్యక్తికి రెండు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. ఆయన డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొంత కాలం నుంచి ఆ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో తరచూ గొడవ పడుతుండేవారు. ఈ గొడవలతో మణికంఠన్ మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

షహాబాద్ ఘటనపై కేజ్రీవాల్ దిగ్భ్రాంతి.. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారమిస్తామని ప్రకటన

మణికంఠన్ చనిపోయాడనే విషయం అతడి స్నేహితులందరికీ తెలిసింది. అఘోరాగా మారిన చిన్న నాటి స్నేహితుడికి కూడా ఈ సమాచారం చేరింది. వెంటనే తనతో పాటు మరో అఘోరాను తీసుకొని సూలూర్ ప్రాంతానికి వచ్చాడు. మణికంఠన్ మృతదేహంపై కూర్చొనే ఎవేవో మంత్రాలు చదువుతూ పూజలు చేశాడు. దీనిని గమనించిన ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం స్నేహితుడి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కాగా.. అఘోరా రావడం, మృతదేహంపై కూర్చుని పూజలు చేయడం స్థానికంగా భయాందోళలను రేకెత్తించడంతో పాటు చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?