‘గే అని చెప్పలేదు’.. మోసపోయానని పెళ్లి అయ్యాక తెలిసింది.. న్యాయం చేయాలని కోర్టుకెక్కిన వివాహిత

Published : Apr 08, 2022, 06:08 PM ISTUpdated : Apr 08, 2022, 07:51 PM IST
‘గే అని చెప్పలేదు’.. మోసపోయానని పెళ్లి అయ్యాక తెలిసింది.. న్యాయం చేయాలని కోర్టుకెక్కిన వివాహిత

సారాంశం

మహారాష్ట్రలోని థానె సెషన్స్ కోర్టులో ఓ విచిత్ర కేసు విచారణకు వచ్చింది. గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్న జంట వివాహం అయిన మూడు నెలలకే వారు విడివిడిగా ఉండటం మొదలెట్టారు. తీరా ఆమె కోర్టుకు ఎక్కిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. తనను మోసం చేశాడని, తన తల్లిదండ్రులనూ నష్టపరిచాడని ఆమె ఆరోపించింది. తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి మగాడు కాదని, గే అని వివరించింది. ఈ విషయం పెళ్లి అయ్యాక తనకు తెలిసిందని పేర్కొొంది.

న్యూఢిల్లీ: వాళ్లిద్దరు ఆన్‌లైన్ పోర్టల్‌లో కలిశారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. బయట కూడా కలిశారు. పలుమార్లు నేరుగా మాట్లాడుకున్నారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా సమ్మతించాయి. గతేడాది నవంబర్ 20న ఘనంగా పెళ్లి కూడా జరిగింది. హనీమూన్ ట్రిప్ కూడా వేశారు. ఏమైందో ఏమో.. మూడు నెలల తర్వాత వారు విడిగా ఉండటం మొదలు పెట్టారు. అంతలోనే ఈ విషయం కోర్టుకు వెళ్లింది. మహారాష్ట్ర థానెలోని ఓ సెషన్ కోర్టును ఆ వివాహిత ఆశ్రయించింది. పెళ్లి చేసుకున్నాక తాను మోసపోయినట్టు తెలిసిందని భోరుమన్నది. తన భర్త పురుషుడు కాదని, గే అని చెప్పింది. తనకు ఈ విషయం దాచి చీట్ చేశాడని ఉక్రోషించింది. తన జీవితాన్ని నాశనం చేశాడిన ఆగ్రహించింది.

ఆమె తరఫు న్యాయవాది వీఏ కులకర్ణీ కోర్టులో వాదిస్తూ.. తమ క్లయింట్ ఆరోపణల్లో స్పష్టత ఉన్నదని, ఆమె భర్త హోమోసెక్సువాలిటీ గలవాడని, ఇతర పురుషులతోనే ఆయన సంపర్కంలో ఉన్నారని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమెకు తన సెక్సువాలిటీ గురించి చెప్పకుండా దాచాడని వాదించారు. ఆయనకు అసలు హెటిరోసెక్సువాలిటీపై ఆసక్తే లేదని, అది తెలిసి కూడా ఆమె జీవితాన్ని కావాలనే నాశనం చేశాడని అన్నారు. అంతేకాదు, ఆయనకు పెరియానల్ వార్ట్స్ అనే వ్యాధి ఉన్నదనీ, దాని గురించి కూడా దాచిపెట్టాడని ఆరోపించారు. తనకు ఎక్కువ జీతం వస్తున్నట్టూ నమ్మబలికాడని పేర్కొన్నారు.

ఈ విషయాలు దాచి తన కుటుంబానికి తీరని ఆర్థిక నష్టం చేకూర్చాడని, అలాగే, తన జీవితాన్ని అంధకారం చేశాడని, భవిష్యత్‌పైనా నీళ్లు చల్లాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి కోసం తాము 18,90,000లు, బంగారు ఆభరణాల కోసం ప్రత్యేకంగా మళ్లీ ఖర్చు అయిందని ఆమె తెలిపారు. ఆయన దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ అప్లికేషన్‌ను కొట్టేయాలని కోరింది.

పెళ్లి చేసుకున్న తర్వాత వారు హనీమూన్ వెళ్లారని ఆమె తెలిపింది. కానీ, ఆయనకు ఏదో వ్యాధి ఉన్నదని, కాబట్టి, హనీమూన్‌లో శారీరకంగా కలవడం సాధ్యం కాదని ఆమెను కన్విన్స్ చేసినట్టు వివరించింది. ఆ తర్వాత ఆయన ఫోన్‌లో కొన్ని ఫొటోలు, వీడియోలు కనిపించాయని, వాటి ద్వారా ఆయన ఇతరు తన మగ పురుషులతో టెలిఫోనిక్ సెక్స్  చేచేస్తున్నట్టు తెలిసిందని పేర్కొంది. పెళ్లి అయినప్పటి నుంచి తాము ఇప్పటి వరకు శారీరకంగా కలువలేదని ఆమె స్పష్టం
చేసింది.

ఈ వాదనలు విన్న తర్వాత అదనపు సెషన్స్ జడ్జీ రాజేశ్ గుప్తా తన తీర్పులో హిందూ మతంలో పెళ్లిని పవిత్రంగా
చూస్తారని, జీవితాంతం భౌతికంగా, శారీరకంగా, స్పిరిచువల్‌గానూ కలిసి ఉంటారని కోరుకుంటారని తెలిపారు. పెళ్లి ఇద్దరూ
ఇష్టపూర్వకంగా చేసుకున్నప్పటికీ తర్వాత వారు కలిసి లేరని వివరించారు. పెళ్లికి ముందే తన వైయక్తిక విషయాల గురించి
ఆ వ్యక్తి వధువు దగ్గర దాచడం నేర కుట్రేనని పేర్కొన్నారు. ఆ వివాహితుడు ఉద్దేశ్యపూర్వకంగానే తన గురించిన వివరాలు
దాడి ఆమెను మోసం చేసినట్టు తెలుస్తున్నదని, తద్వార ఆమె తల్లిదండ్రులను ఆర్థికంగా నష్టపరచడమే కాదు.. ఆమె
జీవితంలోనూ సరిదిద్దలేని నష్టాన్ని మిగిల్చారని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu