
న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో బుధవారం ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుని ఉన్న సమయాన కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ హారన్ కొట్టింది. ఆమె హారన్‌తో చిర్రెత్తుకొచ్చి ఆమె కారు ముందు నిలుచున్న వాహనం నుంచి దిగి వచ్చిన మరో ప్రయాణికుడు ఆమెను కారులో నుంచి బయటకు లాగి కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైనట్టు గురువారం పోలీసులు వివరించారు. గురుగ్రామ్‌లో ఎండీఐ చౌక్ దగ్గర బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కారును అప్పుడే ఓవర్ టేక్ చేసిన ఓ వ్యక్తి ఎండీఐ చౌక్ సమీపంలో ట్రాఫిక్ జామ్ సమయంలో తన ముందే ఆపాడని ఆమె పేర్కొంది. తనను కారులో నుంచి బయటకు లాగి పలుమార్లు దాడి చేశాడని ఆరోపించింది. అంతేకాదు, తనను చంపేస్తాననీ బెదిరించాడని వివరించింది. తన ఇంటికి వచ్చి మరీ మరోసారి కొడతానని బెదిరించినట్టు ఫిర్యాదులో ఆరోపణలు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఓ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో పని చేస్తుంది.
Also Read: సిద్దిపేటలో మద్యం మత్తులో బిల్‌బోర్డుకు వేలాడిన మందుబాబు.. వైరల్ వీడియో ఇదే
తన పై దాడి చేసిన తర్వాత కొంత మంది చుట్టూ వచ్చి చేరారని మహిళ తెలిపింది. తన ఎడమ కంటిపై, ముక్కుపై గాయాలు అయినట్టు పేర్కొంది. ఆమె ఫిర్యాదుపై ఐపీసీలోని సెక్షన్లు 323, 506, 509 కింద బుధవరాం రాత్రి కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీ సహాయంతో నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నట్టు ఎస్‌హెచ్‌వో ఇన్‌స్పెక్టర్ హరేష్ కుమార్ తెలిపారు.