షాక్: పెరిగిన వంట గ్యాస్ ధర, సిలిండర్ ధర ఎంతంటే?

First Published Jun 1, 2018, 2:28 PM IST
Highlights

సామాన్యుడిపై భారం

న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర పెరిగింది. ఇప్పటికే పెట్రోల్,
డీజీల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు
గ్యాస్ ధరలు పెంచి కేంద్రం షాకిచ్చింది.

సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పై రూ. 2.34, సబ్సిడీయేతర గ్యాస్
సిలిండర్ పై రూ.48 చొప్పున ధరలను పెంచుతూ కేంద్రం
నిర్ణయం తీసుకొంది.

ప్రస్తుత సబ్సిడీ సిలిండర్ధర రూ. 493.55, సబ్సిడీయేతర
సిలిండర్ ధర రూ.698.50కు చేరుకొంది. 


కోల్‌కతాలో రాయితీగల వంటగ్యాస్ సిలిండర్ ధర  
రూ.496.65, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 723.50,
ముంబైలో సబ్సిడీ సిలిండర్ ధర రూ. 491.31, రాయితీ లేని
సిలిండర్ ధర  రూ. 671.50 ఉండగా.. చెన్నైలో సబ్సిడీ
సిలిండర్ ధర రూ. 481.84, రాయితీ లేని సిలిండర్ ధర రూ.
712.50 కు చేరింది.


ఇప్పటికే పెట్రోల్, డీజీల్ ధరలను పెంచడం వల్ల  ప్రజలు
తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.పెట్రోలియం
ఉత్పత్తుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 

పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలను
తగ్గించేందుకు గాను  జఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే కూడ కేంద్రం యోచిస్తోంది.


 

click me!