జామా మసీదులో మహిళలపై ఆంక్షలు... రంగంలోకి లెఫ్టినెంట్ గవర్నర్, దిగొచ్చిన ఇమామ్

By Siva KodatiFirst Published Nov 24, 2022, 10:00 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలోని జామా మసీదులోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోవడంతో నిషేధాన్ని ఇమామ్ బుఖారీ వెనక్కి తీసుకున్నారు. 

ఢిల్లీలోని జామా మసీదులో బాలికల ప్రవేశంపై మత పెద్దలు విధించిన నిషేధం జాతీయ స్థాయిలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో మత పెద్దలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మసీదు షాహీ ఇమామ్ బుఖారీతో మాట్లాడటంతో వివాదానికి తెరపడినట్లయ్యింది. అంతకుముందు జామా మసీదులో బాలికల ప్రవేశంపై ఆంక్షల నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమీషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడిని పూజించే హక్కు పురుషుడికి ఎంత ఉందో.. స్త్రీకి అంతే వుంటుందన్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే మసీదు ఇమామ్‌కు నోటీసులు జారీ చేస్తామని స్వాతి హెచ్చరించారు. 

కాగా.. దేశ రాజధాని ఢిల్లీలోని జామా మసీదు చాలా ఫేమస్. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ఆ మసీదును దర్శించుకునేవారు. తాజాగా, ఈ మసీదు మహిళలపై ఆంక్షలు విధించింది. పురుషులు వెంట లేకుండా ఒంటరి మహిళ ఈ మసీదులో రావడం కుదరదని స్పష్టం చేసింది. ఒంటరి మహిళలకు ఈ మసీదులోకి ఎంట్రీ లేదని ఓ నోటీసు మసీదు ముందు ఎంట్రెన్స్ గేటు దగ్గర అంటించారు. ఎవరైనా ఒక మహిళ జామా మసీదులోకి వెళ్లాని భావిస్తే.. తప్పకుండా ఆమె తన కుటుంబానికి చెందిన పురుషుడితో కలిసే రావాలని స్పష్టం చేసింది. కుటుంబంతో కలిసి వచ్చే మహిళలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని వివరించింది.

Also REad:మహిళలపై జామా మసీదు ఆంక్షలు.. పురుషులు వెంట లేకుండా ఒంటిగా వస్తే నో ఎంట్రీ

అయితే... మసీదు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సబివుల్లా ఖాన్ ఈ ఆంక్షలను సమర్థించారు. మసీదులోకి వచ్చే ఒంటరి మహిళలు అభ్యంతరకర పనులు చేస్తున్నారని, వీడియోలు తీస్తున్నారని, టిక్ టాక్ వీడియోలు తీస్తున్నారని, టైమ్ పాస్ చేయడానికి, లేదా ఎవరినో కలవడానికి ఈ మసీదును ఎంచుకోవడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పనుల వల్ల ప్రార్థనలు చేసే వారికి ఇబ్బంది తలెత్తుతున్నదని పేర్కొన్నారు. ఏ మతప్రదేశమైనా.. మసీదైనా, మందిరమైనా ప్రార్థనల కోసం వస్తేనే బాగుంటుందని, మసీదు ఎందుకు ఉన్నదో ఆ లక్ష్యం అమలయ్యేలా ఉండాలని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అయితే, తాము మహిళలపై నిషేధం విధించలేదని, ఒంటిగా వచ్చే మహిళలపైనే ఆంక్షలు విధించామని చెప్పారు. కుటుంబంతో వచ్చే మహిళలపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు.
 

click me!