
లక్నో: ఉత్తరప్రదేశ్ విషాదం చోటుచేసుకుంది. ఐదేళ్లలోపు నలుగురు పిల్లలు ఇంటి వాకిట్లో దొరికిన చాక్లెట్లు తిన్నారు. విషం నిండిన ఆ చాక్లెట్ల కారణంగా ఆ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఖుషీనగర్ జిల్లా కాస్య ఏరియాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆ ఏరియాలో కలకలం రేపింది. సీఎం ఈ ఘటనపై వెంటనే స్పందించారు. ఈ ఘటనను వేగంగా దర్యాప్తు చేయాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని పోలీసులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
దిలీప్‌నగర్ గ్రామంలో ముఖియా దేవి నివసిస్తున్నది. ఆమె ఈ రోజు ఉదయం ఇల్లు, వాకిలి ఊడుస్తుండగా ఆమె మనవలు, మనవరాలు ఆడుతూ కనిపించారు. మంజన(5), స్వీటి(3), సమర్(2) సొంత అక్కా తమ్ముళ్లు. వీరితోపాటు పొరుగునే ఉండే అరుణ(5)లు ఆ ఇంటి ముందు ఆడటానికి వచ్చారు. ఇంటి ముందు డోర్ దగ్గర ఓ ప్లాస్టిక్ కవర్‌లో కొన్ని కాయిన్లు, చాక్లెట్లు కనిపించాయి. ఆ చుట్టిన కవర్‌ను వారు తెరిచి చూశారు. ఐదు చాక్లెట్లు ఉన్నాయి. వాటిలో నాలుగు చాక్లెట్లను నలుగురూ తీసుకుని తిన్నారు. కొంత సేపటికి వారు స్పృహ తప్పి పడిపోయారు. ఈ విషయం గుర్తించిన బంధువులు వెంటనే వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే ఆ నలుగురు పిల్లలు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వరుణ్ కుమార్ పాండే వెల్లడించారు.
స్పృహ కోల్పోవడానికి ముందు ఆ నాలుగో పిల్లాడు చాక్లెట్ల గురించి చెప్పాడు. రోడ్డ పక్కన ఇంటికి సమీపంలో పడి ఉన్న చాక్లెట్లు తాము తీసుకుని తిన్నామని తెలిపాడు.
పోలీసులకు ఈ విషయం తెలియగానే వెంటనే ఘటనా ప్రాంతానికి ఓ బృందం వచ్చింది. మరో బృందం హాస్పిటల్‌కు వెళ్లింది. మిగిలిన ఒక చాక్లెట్‌ను, కాయిన్స్, పిల్లలు తిన్న చాక్లెట్ల తాలూకు కవర్(రాపర్లు)లను భద్రపరుస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
లాన్సెట్ చైల్డ్ & అడోలసెంట్ హెల్త్ జర్నల్ లో ప్రచురించిబడిన నివేదిక వివరాల ప్రకారం.. కరోనా ప్రభావం అధికంగా ఉన్న మొత్తం 20 దేశాల అంశాలను ఇందులో ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా, COVID-19 ఫలితంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకుని మరణాన్ని అనుభవించినట్లు అంచనా వేయబడిన పిల్లల సంఖ్య 5.2 మిలియన్లకు పైగా పెరిగిందని పరిశోధకులు తెలిపారు. కోవిడ్-19- కారణంగా అనాథలైన.. సంరక్షకుని మరణాల బారిన పడిన పిల్లల సంఖ్య కరోనా మహమ్మారి మొదటి 14 నెలల తర్వాత సంఖ్యలతో పోలిస్తే.. గతేడాది మే 1 నుంచి అక్టోబర్ 31వరకు అంటే ఈ ఆరు నెలల్లో దాదాపు రెట్టింపు అయినట్లు ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా COVID-19 కారణంగా అనాథలైన ముగ్గురు పిల్లలలో ఇద్దరు 10 నుండి 17 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న పిల్లలు ఉన్నారు. అనాథలు, సంరక్షులు లేని వారి అంచనాలు తక్కువగానే అంచనా వేయబడుతున్నాయని తెలిపింది. మరింత డేటా అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైన నివేదిక పేర్కొంది.