చంద్రబాబుకి మమతా బెనర్జీ మద్దతు

Published : Nov 16, 2018, 04:26 PM IST
చంద్రబాబుకి మమతా బెనర్జీ మద్దతు

సారాంశం

 చంద్రబాబు నాయుడుకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు తెలిపారు. ఏపీలో సీబీఐ అధికారుల దాడులను నిరాకరిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే
‘‘సమ్మతి’’ ఉత్తర్వును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

కాగా.. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై మమతా బెనర్జీ  తాజాగా స్పందించారు.  చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైందేనని ఆమె అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ఆమె మద్దతు పలికారు. 

రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ‘సమ్మతి’ ఉత్తర్వును ‌ నిన్న ఉపసంహరించుకుంది. అంతర్గత విభేదాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రతిష్ఠ మసకబారిందని, రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించిన చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు చదవండి

కేంద్రానికి చంద్రబాబు మెలిక....ఏపీలో సీబీఐకి ‘‘నో ఎంట్రీ

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం