కశ్మీర్‌పై అఫ్రిది వ్యాఖ్యలు... స్పందించిన శివసేన

By sivanagaprasad kodatiFirst Published Nov 16, 2018, 1:56 PM IST
Highlights

భారత్, పాక్‌ల మధ్య దశాబ్ధాలుగా నడుస్తోన్న కశ్మీర్ వివాదంపై.. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అతని వ్యాఖ్యలపై శివసేన  ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు తన ఆస్థాన పత్రిక ‘‘సామ్నా’’లో  వ్యాసాన్ని ప్రచురించింది. 

భారత్, పాక్‌ల మధ్య దశాబ్ధాలుగా నడుస్తోన్న కశ్మీర్ వివాదంపై.. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘‘ ఉన్న నాలుగు రాష్ట్రాలనే పాక్ ప్రభుత్వం సరిగా పాలించలేకపోతోందని.. మళ్లీ పాక్‌కు కశ్మీర్‌ ఎందుకని ప్రశ్నించడంతో పాటు.... భారత్‌కు కూడా కశ్మీర్‌ను అప్పగించే ప్రసక్తి లేదని, కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశాడు. 

అతని వ్యాఖ్యలపై శివసేన  ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు తన ఆస్థాన పత్రిక ‘‘సామ్నా’’లో  వ్యాసాన్ని ప్రచురించింది. పాక్ ప్రభుత్వంతో పాటు అక్కడి మిలటరి తమ దేశ పరిపాలనను పక్కన బెట్టి భారత్‌ను ఏ విధంగా దెబ్బ కొట్టాలా అని 70 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడింది.. 

ఇది ఆ దేశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని  అందువల్ల ఆ దేశంలోని విచక్షణ కలిగిన పౌరులు కశ్మీర్ విషయంలో అంత సానుకూలంగా లేరని వ్యాఖ్యానించింది. చాలా మంది మనసులో ఉన్న మాటను అఫ్రిది వ్యక్తపరిచాడని తెలిపింది.

ఉగ్రవాదాన్ని ప్రొత్సహించడంతో పాటు అవినీతితో పాకిస్తాన్ పేదరికంలో కూరుకుపోయిందని.. ఏకంగా దేశ ప్రధానమంత్రి కార్యాలయం పశువులు, కార్లు అమ్మే కేంద్రంగా మారిందని ఇది దేశ ప్రజల మనసులో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావాన్ని పంపుతోందని సామ్నా వ్యాఖ్యానించింది. 

ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్.. ఐఎంఎఫ్ నుంచి ఆర్ధిక సాయం నిలిచిపోవడంతో చైనా వంటి దేశాల నుంచి సాయం కోసం ఆర్రులు చాస్తోందని అభిప్రాయపడింది. ఒకవేళ దేశం ఆర్ధికంగా నిలదొక్కుకోవాలని.. అభివృద్ధిలో వేగంగా పయనించాలని అనుకుంటున్న పాక్ పౌరులకు కశ్మీర్ అనవసరమని తోస్తోందని సామ్నా వ్యాఖ్యానించింది.

 అయితే ఇదే సందర్భంలో సామ్నా.. అఫ్రిదిని భారత వ్యతిరేకిగా పేర్కొంది. అనేక సందర్భాలలో అతను దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని తెలిపింది. భారత సైన్యం 13 మంది తీవ్రవాదులను హతమార్చిన సందర్భంలోనూ.. కశ్మీర్ స్వాతంత్ర్యం విషయంలోనూ అఫ్రిది భారత్‌ను తీవ్రంగా తప్పుబడుతూ వస్తున్నాడని ఎడిటోరియల్‌లో పేర్కొంది. 

కాశ్మీర్‌పై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న పాకిస్థానీ మాజీ క్రికెటర్ అఫ్రిది

click me!