కరోనా కలకలం: పూరీ జగన్నాథ్ ఆలయంలో 400 మందికి కోవిడ్

By narsimha lodeFirst Published Sep 29, 2020, 2:31 PM IST
Highlights

పూరీ జగన్నాథ్ ఆలయంలో సేవకులు, పూజారులు 400 మందికి కరోనా సోకింది. ఆలయాన్ని తెరవాలని భావిస్తున్న తరుణంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు బయటపడడం ఆందోళన కల్గిస్తోంది.


భువనేశ్వర్: పూరీ జగన్నాథ్ ఆలయంలో సేవకులు, పూజారులు 400 మందికి కరోనా సోకింది. ఆలయాన్ని తెరవాలని భావిస్తున్న తరుణంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు బయటపడడం ఆందోళన కల్గిస్తోంది.

ఈ ఏడాది మార్చి నుండి రాష్ట్రంలోని ఆలయాలు దాదాపుగా మూసి ఉంచారు.పూరీలోని జగన్నాథుడి ఆలయాన్ని తెరవాలని భక్తుల నుండి డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో  రాష్ట్రంలో మతపరమైన ప్రదేశాలను తెరవడానికి  సిద్దంగా లేమని హైకోర్టుకు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

హైకోర్టులో దాఖలైన పిల్ కు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ ఆలయ గర్భగుడిలో తగినంత స్థలం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

భక్తులకు జగన్నాథుడిని దర్శించుకొనేందుకు అనుమతి ఇస్తే పెద్ద ఎత్తున కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. 351 మంది సేవకులు, 53 మంది అధికారులు ఈ ఆలయంలో కరోనా బారినపడ్డారని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన అఫిడవిట్ లో ప్రకటించింది.

కరోనాతో ఇప్పటికే 9 మంది మృతి చెందారు. మరో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా ఆలయ అధికారులు తెలిపారు.ఆలయంలో నిత్య సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకొన్నామని అధికారులు ప్రకటించారు.

పూరీ రథయాత్ర తర్వాత ఆలయంలోని 822 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే  ఇద్దరికి మాత్రమే కరోనా సోకింది. కానీ ఆ తర్వాత ఈ ఆలయంలో పనిచేసేవారికి కరోనా వ్యాప్తి చెందింది.

ఈ ఏడాది నవంబర్ లో జగన్నాథ్ ప్రభువు నాగార్జున భేషాపై కూడ కరోనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 26 ఏళ్ల తర్వాత విరామం జరుగుతోంది.
 

click me!