కొత్త వ్యవసాయ చట్టం: విపక్షాల నిరసనలపై మోడీ సీరియస్ కామెంట్స్

Published : Sep 29, 2020, 01:03 PM IST
కొత్త వ్యవసాయ చట్టం: విపక్షాల నిరసనలపై మోడీ సీరియస్ కామెంట్స్

సారాంశం

నేడు కేంద్ర ప్రభుత్వం రైతులకు వారి హక్కులను ఇస్తున్న సమయంలో కూడ నిరసన వ్యక్తం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్షాలకు చురకలంటించారు. 

న్యూఢిల్లీ: నేడు కేంద్ర ప్రభుత్వం రైతులకు వారి హక్కులను ఇస్తున్న సమయంలో కూడ నిరసన వ్యక్తం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్షాలకు చురకలంటించారు. .

 

కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో విపక్షాలు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నిరసనలపై మోడీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.  గతంలో కూడ పలు అంశాలను  విపక్షాలు వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

 

దేశంలోని రైతులు తమ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో విక్రయించలేరని వీరు కోరుకొంటున్నారన్నారు.రైతులు పూజించే వస్తువులు సామాగ్రికి నిప్పంటించి రైతులను అవమానపరుస్తున్నారని ఆయన మండిపడ్డారు.

భారత్ చొరవతో ప్రపంచం మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్న సమయంలో దేశంలో కూర్చొన్న కొందరు వ్యతిరేకించారన్నారు. సర్ధార్ పటేల్ ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించిన సమయంలో కూడ దీన్ని వ్యతిరేకించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలోని ఏ పెద్ద నాయకుడు కూడ  ఈ రోజు వరకు ఈ విగ్రహాం వరకు వెళ్లలేదని ఆయన తెలిపారు.

 

గత నెలలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించాంవీళ్లంతా రామ మందిరం కోసం వ్యతిరేకంగా పనిచేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. భూమి పూజ కూడ వ్యతిరేకించారు.

నాలుగేళ్ల క్రితం  ఇదే సమయంలో  సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన సమయం ఇది అని ఆయన గుర్తు చేశారు.కాకపోతే  సర్జికల్ స్ట్రైక్స్ కు ఆధారాలు అడుగుతున్నారని ఆయన విపక్షాలపై విరుచుకుపడ్డారు.సర్జికల్ స్ట్రైక్స్ కు వ్యతిరేకించడం ద్వారా తమ మనోగతాన్ని వెల్లడించారని ఆయన అభిప్రాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu