లాలూకు షాక్: ఆర్జేడీకి రఘువంశ్ ప్రసాద్ సింగ్ గుడ్‌బై

By narsimha lodeFirst Published Sep 10, 2020, 3:37 PM IST
Highlights

బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనునన్ తరుణంలో ఆర్జేడీకీ భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ రాజీనామా చేశారు.

పాట్నా:బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనునన్ తరుణంలో ఆర్జేడీకీ భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ రాజీనామా చేశారు.

మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యూ)లో చేరనున్నారు.రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆర్జేడీ, జనతాదళ్ లో 1997 నుండి కొనసాగారు. కరోనా కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో రఘువంశ్ ప్రసాద్ కరోనా కోసం చికిత్స పొందుతున్నారు.

కార్పూరి ఠాకూర్ మరణం తర్వాత తాను 32 ఏళ్లుగా మీ వెనుక నిలబడ్డాను.. ఇక భవిష్యత్తులో ఆ పని చేయలేను అని రఘువంశ్ ప్రసాద్ సింగ్ చెప్పారు. ఓ పేపర్ పై ఆయన ఈ విషయాన్ని రాశాడు.  దయచేసి తనను క్షమించాలని కూడ ఆయన కోరాడు. 

ఆర్జేడీ నేతల వైఖరి కారణంగా రఘువంశ్ ప్రసాద్ సంతోషంగా లేరని చెబుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లిన తర్వాత తేజస్వి యాదవ్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో  తాను సంతోషంగా లేనని ఈ ఏడాది జూన్ మాసంలో రఘువంశ్ ప్రసాద్ పార్టీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

బీహార్ ఎగువ సభలో ఆర్జేడీకి ఎనిమిది మంది సభ్యులున్నారు. జూన్ మాసంలోనే ఐదుగురు నితీష్ కుమార్ పార్టీలో చేరారు. ఇక ఆర్జేడీకి ఎగువ సభలో మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవితో మరో ఇద్దరు ఉన్నారు.రాజ్యసభకు వ్యాపారవేత్తలను ఎంపిక చేయడంపై కూడ రఘువంశ్ ప్రసాద్ సింగ్ అసంతృప్తితో ఉన్నారు.

click me!