బలూచిస్థాన్‌లో పౌరులపై ఆఫ్ఘన్ బలగాల కాల్పులు.. 6 గురు మృతి.. 17 మందికి గాయాలు

By team teluguFirst Published Dec 12, 2022, 9:24 AM IST
Highlights

పాకిస్థాన్ పౌరులపై ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన భద్రతా బలగాలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 6 గురు పౌరులు చనిపోయారు. 17 మందికి గాయాలు అయ్యాయి. 

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని చమన్ జిల్లా సరిహద్దు సమీపంలో ఆదివారం ఆఫ్ఘన్ దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాకిస్తానీ పౌరులు మరణించారు. కాగా మరో 17 మంది గాయపడ్డారు. ఈ సమాచారాన్ని సైన్యం వెల్లడించింది. మిలిటరీ మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్ పీఆర్) ప్రకారం.. ఆఫ్ఘన్ దళాలు జరిపిన కాల్పుల్లో ఫిరంగి షెల్లు, మోర్టార్లతో పాటు భారీగా ఆయుధాలను ఉపయోగించారు.

క్యాబ్ లో ప్రయాణిస్తున్న మహిళకు, డ్రైవర్, ప్రయాణికుల వేధింపులు.. పదినెలల చిన్నారిని తోసేసి, హత్య...

‘‘ ఆఫ్ఘన్ సరిహద్దు దళాలు పౌర జనాభాపై ఫిరంగి, మోర్టార్లతో పాటు భారీ ఆయుధాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి’’ అని ఐఎస్ పీఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాల్పుల్లో ఆరుగురు పాకిస్థానీ పౌరులు మరణించారని, మరో 17 మంది గాయపడ్డారని ఆ ప్రకటన పేర్కొంది. ఈ ఘటనలో క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలిపింది. పాక్ సరిహద్దు బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని ఆ ప్రకటన పేర్కొంది.

'మన సంగతేంటి... బంతి మన కోర్టులో ఉంది': బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్న బీహార్ సీఎం..

పరిస్థితి తీవ్రతను గమనించిన పాకిస్థాన్ ప్రభుత్వం కాబూల్‌లోని ఆఫ్ఘన్ అధికారులను సంప్రదించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఈ కాల్పులకు గల కారణం ఇంకా తెలియరాలేదు. ఆఫ్ఘన్ వైపు ఎంత నష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందుబాటులో లేదు. కాగా.. ఈ ఘటనకు ముందు స్పిన్ బోల్డక్ గేట్ దగ్గర మోర్టార్ పడిపోవడం వల్ల నలుగురు మరణించారు. 20 మంది గాయపడ్డారు. గత నెలలో చమన్ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఒక దుండగుడు పాకిస్తాన్ సెక్యూరిటీ గార్డును కాల్చి చంపాడు.

చేతబడి చేశారనే అనుమానంతో దంపతులపై దాడి చేసి..ఆపై ..

గత ఏడాది తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. మిలిటెంట్ గ్రూపులు ఆఫ్ఘన్ గడ్డ నుండి దాడులకు ప్లాన్ చేస్తున్నాయని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడాన్ని తాలిబన్లు ఖండించారు. కానీ రెండు దేశాల మధ్య 2,700 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి ఇస్లామాబాద్ ఏర్పాటు చేసిన కంచెపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 

click me!