Aero India 2023: అత్యాధునిక ఎఫ్-35ఏ లైట్‌నింగ్ II యుద్ధ విమానాన్ని ప్రదర్శించనున్న అమెరికా

Published : Feb 13, 2023, 10:39 AM IST
Aero India 2023: అత్యాధునిక ఎఫ్-35ఏ లైట్‌నింగ్ II యుద్ధ విమానాన్ని ప్రదర్శించనున్న అమెరికా

సారాంశం

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ఎరో ఇండియా 2023ను మన దేశం బెంగళూరులో నిర్వహిస్తున్నది. ఈ ఈవెంట్‌ గురించి అమెరికా రేర్ అడ్మైరల్ మైఖేల్ బేకర్ మాట్లాడుతూ ‘ఇప్పటికే మావి రెండు ఎఫ్/ఏ 18 ఫైటర్ జెట్లు, రెండు ఎఫ్-16 వైపర్లు ఇక్కడ గ్రౌండ్‌లో సిద్ధంగా ఉన్నాయి. ఈ వారంలో సందడి చేయబోతున్న మా ఇతర విమానాల కోసం మీరు అలా ఆకాశం వైపు చూస్తు ఉండండి’ అని అన్నారు.  

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్ షోను మన దేశం బెంగళూరులో నిర్వహిస్తున్నది. ఇది సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నది. ఈ ఎయిర్ షోలో అమెరికా దాని అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-35ఏను ప్రదర్శించడానికి సన్నద్ధం అవుతున్నది. అయితే, ఆ ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను ఇండియాకు ఆఫర్ చేసే ప్లాన్స్ ఏమీ లేవని అమెరికా వైమానిక దళ వర్గాలు ధ్రువీకరించాయి.

ఎరో ఇండియా 2023 ఎయిర్ షోలో యూఎస్ఏఎఫ్ ఎఫ్-35ఏ లైట్‌నింగ్ II పాల్గొనబోతున్నట్టు డెమన్‌స్ట్రేషన్ టీమ్ ఇప్పటికే ధ్రువీకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ టీమ్ దీనికి సంబంధించిన ఓ ప్రకటన చేసింది. ఇండియాలోని బెంగళూరులో నిర్వహిస్తున్న ఎరో ఇండియా షోలో తాము ఎఫ్-35ఏ ఫైటర్ జెట్‌ను ప్రదర్శించబోతున్నామని వెల్లడించడానికి సంతోషిస్తున్నామని పేర్కొంది. ఆసియాలోనే అతిపెద్ద ఎరోస్పేస్ ట్రేడ్ షోలో ఐదో తరం ఎయిర్ పవర్‌ను ప్రదర్శిస్తున్నందుకు తామెంతో గర్వపడుతున్నట్టు వివరించింది. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తాము ఎదురుచూస్తున్నామని, అలాగే, మిగిలిన దేశాలూ ఇందులో పాల్గొనడంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపింది.

ఎరో ఇండియా 2023 సందర్భంగా ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ వద్ద సీనియర్ డిఫెన్స్ అఫీషియల్, డిఫెన్స్ అటాచీ రేర్ అడ్మైరల్ మైఖేల్ బేకర్ మాట్లాడారు. ఎఫ్-35 ద్వారా ప్రపంచంలోనే అత్యాధునిక యుదు్ధ విమానాన్ని భారత ఎయిర్ షోకు తీసుకువస్తున్నామని వివరించారు. తమ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మకంగా తమ బలపరచడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.

అమెరికా నుంచి అతిపెద్ద డెలగేషన్ రావడం, కొనుగోలు ఒప్పందాలేవీ ఉండబోవని అమెరికా స్పష్టం చేసింది రేర్ అడ్మైరల్ బేకర్ మాట్లాడుతూ ఇదంతా భారత్ ఎయిర్ షో, ఉభయ దేశాల మధ్య సన్నిహిత సంబందాలను, బలాన్ని ప్రదర్శించడానికే అని వివరించారు. అంతకు మించి ఈ ఫైటర్ జెట్ ప్రదర్శన ద్వారా కొనుగోలు ఒప్పందం కుదురుతుందన్న ఉద్దేశాలేవీ తమకు లేవని తెలిపారు. ఇది కేవలం ఉభయ దేశాల బంధం బలం కోసమే అని వివరించారు. ఇప్పుడు యెలహంక ఎయిర్ బేస్‌లో ఎన్నో యుద్ధాల్లో కీలకంగా వ్యవహరించిన ఎఫ్/ఏ 18 సూపర్ హార్నెట్ ఎయిర్ ‌క్రాఫ్ట్ ఉన్నదని పేర్కొన్నారు. ఇది భారత్‌ను సపోర్ట్ చేయడానికే అని వివరించారు.

ఇప్పుడు రెండు ఎఫ్/ఏ 18 విమానాలు గ్రౌండ్‌లో సిద్ధంగా ఉన్నాయని, అలాగే, ఎఫ్-16 వైపర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఇప్పుడు మీరు చేయాల్సిందంతా కేవలం ఈ వారమంతా కళ్లను ఆకాశానికి అప్పగించడమే అని అన్నారు.

Also Read: From the IAF Vault: భారత వైమానిక దళానికి మొదటి చీఫ్‌ను ఎలా ఎంపిక చేశారో తెలుసా? తెరవెనుక ఆసక్తికర పరిణామాలు

ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను ఇండియాకు ఆఫర్ చేస్తున్నారనే వాదనలకు అడ్మైరల్ బేకర్ ఫుల్ స్టాప్ పెట్టారు.

తమను అసలు ఆ ఫైటర్ జెట్ కావాలని అడగనే లేదని అన్నారు. ఇప్పటి వరకైతే ఉన్నతస్థాయిలో ఆ మేరకు సంప్రదింపులు జరగలేవని వివరించారు. తనకు తెలిసినంత వరకు ఇండియా తన భావి ఫైటర్లను స్వయంగా నిర్మించుకోవడంపైనే ఫోకస్ పెట్టిందని అన్నారు. అలాగే ఎఫ్-35 ఫైటర్ అనేది విదేశీ మిలిటరీకి అమ్మాలనే పాయింటే లేదని వివరించారరు. వైమానిక, నావికా, ఆర్మీపరంగా బలమైన దేశాలైన ఉభయ దేశాల మధ్య సన్నిహిత రక్షణ భాగస్వామ్యాన్ని చూపించడానికే అని వివరించారు. ఈ రీజియన్‌లో సెక్యూరిటీ, అవాంఛనీయ ఘటనలను నిరోధించడానికి సంయుక్తంగా ఎదుర్కొనే అవకాశాలను సుగమం చేసుకోవడానికి అని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?