ఆదిత్య ఎల్-1 సెల్ఫీ.. అలాగే ఒకే ఫ్రేమ్‌లో భూమి, చంద్రుడు.. వీడియో షేర్ చేసిన ఇస్రో

Published : Sep 07, 2023, 12:11 PM ISTUpdated : Sep 07, 2023, 12:24 PM IST
ఆదిత్య ఎల్-1 సెల్ఫీ.. అలాగే ఒకే ఫ్రేమ్‌లో భూమి, చంద్రుడు.. వీడియో షేర్ చేసిన ఇస్రో

సారాంశం

సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మిషన్ ఆదిత్య ఎల్-1. భారత్ చేపట్టిన ఈ తొలి సొలార్ మిషన్ విజయవంతంగా సాగిపోతోంది.

సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మిషన్ ఆదిత్య ఎల్-1. భారత్ చేపట్టిన ఈ తొలి సొలార్ మిషన్ విజయవంతంగా సాగిపోతోంది. అందులో భాగంగా మంగళవారం తన  ఎర్త్ బౌండ్ విన్యాసాన్ని పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఇస్రో ప్రకటించింది. ఇక, ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని భూమి నుంచి సూర్యుడి దిశలో లాగ్రేంజ్‌ పాయింట్‌-1 (ఎల్‌-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 

అయితే తాజా ఆదిత్య ఎల్-1 మిషన్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని ఇస్రో సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (VELC), సోలార్ అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT)తో సహా దాని పేలోడ్‌ల చిత్రాలను ఆదిత్య-ఎల్ 1 ఆన్‌బోర్డ్ కెమెరా సెప్టెంబరు 4న తీసిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం ప్రకటించింది. ఈ మేరకు సెల్పీ చిత్రాన్ని షేర్ చేసింది. 

 

ఇక, ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం భూమి, చంద్రుని చిత్రాలు ఒకే ఫ్రేమ్‌లో బంధించింది. ఈ ఫొటోలను కూడా ఇస్రో వీడియోలో షేర్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌