పార్లమెంట్ వర్షకాల సమావేశాలు.. రాజ్యసభ నుంచి మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్

Published : Jul 28, 2022, 12:34 PM IST
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు.. రాజ్యసభ నుంచి మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్

సారాంశం

పార్లమెంట్‌ వర్షకాల సమావేశాలలో విపక్ష ఎంపీలు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉభయ సభలలో విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు సస్పెన్షన్ ఎదుర్కొంటున్నారు. తాజాగా రాజ్యసభ నుంచి మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సస్పెండ్ చేశారు. 

పార్లమెంట్‌ వర్షకాల సమావేశాలలో విపక్ష ఎంపీలు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉభయ సభలలో విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు సస్పెన్షన్ ఎదుర్కొంటున్నారు. తాజాగా రాజ్యసభ నుంచి మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పథక్, ఇండిపెండెంట్ ఎంపీ అజిత్ కుమార్ భుయాన్ ఉన్నారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు వారిని ఈ వారం సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా  రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చెప్పారు. 

దీంతో పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ఇప్పటివవరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 27కి చేరింది. వీరిలో రాజ్యసభకు చెందిన 23 మంది ఎంపీలు, లోక్‌సభకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు. 

ఇక,మండిపోతున్న నిత్యావసరాల ధరలు, ఆహార పదార్థాలపై జీఎస్టి, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టి వర్షాకాల సమావేశాల నుండి సస్పెండయిన ప్రతిపక్ష ఎంపీలు పలువురు ఆందోళన కొనసాగిస్తున్నారు. గత రాత్రంతా ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.  ఇలా పగలూ రాత్రి 50 గంటల పాటు నిరసన చేపట్టాలని నిర్ణయించారు. 
 

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు