రోజుకి 15 గంటలు గేమ్స్ ఆడిన టీనేజర్... చివరికి ఏమైందంటే..!

Published : Jul 12, 2023, 10:39 AM IST
రోజుకి 15 గంటలు గేమ్స్ ఆడిన టీనేజర్... చివరికి ఏమైందంటే..!

సారాంశం

ఆన్‌లైన్ గేమ్‌లు యువకుల మానసిక ఆరోగ్యం,  శ్రేయస్సును ఎలా దెబ్బతీస్తున్నాయో చెప్పడానికి అల్వార్ టీనేజ్ కేసు ఒక ఉదాహరణ. 15 ఏళ్ల బాలుడు ఈ ఆటలను ఆరు నెలల పాటు నాన్‌స్టాప్‌గా ఆడాడు.  

ఈరోజుల్లో చాలా మంది పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. రోజులో గంటలు గంటలు ఫోన్ లో గేమ్స్ ఆడుతూనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఓ టీనేజర్ కూడా అలానే ఓ ఆన్ లైన్ గేమ్ కి బానిసగా మారిపోయాడు. చివరకు జబ్బున పడి, ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాల్సి వచ్చింది. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో ని అల్వార్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

PUBG, ఫ్రీ-ఫైర్ వంటి ఆన్‌లైన్ గేమ్‌లు యువకుల మానసిక ఆరోగ్యం,  శ్రేయస్సును ఎలా దెబ్బతీస్తున్నాయో చెప్పడానికి అల్వార్ టీనేజ్ కేసు ఒక ఉదాహరణ. 15 ఏళ్ల బాలుడు ఈ ఆటలను ఆరు నెలల పాటు నాన్‌స్టాప్‌గా ఆడాడు.

7వ తరగతి చదువుతున్న ఆ బాలుడు మొబైల్ గేమింగ్‌కు బానిసయ్యాడు. అతని మొబైల్‌లో ఫ్రీ ఫైర్ , బాటిల్ రాయల్ గేమ్ వంటి ఆన్‌లైన్ గేమ్‌లకు అతని వ్యసనం అతని శ్రేయస్సు, మానసిక సమతుల్యతను దెబ్బతీసింది. ఫలితంగా, అతను ఇప్పుడు చికిత్స కోసం వికలాంగ సంస్థలోని హాస్టల్‌లో చేరాడు.

మొబైల్‌లో గేమ్‌లు ఆడాలన్న ఆ బాలుడి మోజు అతని కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అతని గేమింగ్ అలవాట్లను పరిమితం చేయడానికి, కుటుంబం మొదట అతనిని రెండు నెలల పాటు నిరోధించడానికి ప్రయత్నించింది. వారంత ప్రయత్నించినప్పటికీ, ఆ యువకుడు తన మొబైల్‌లో PUBG లాంటి గేమ్‌లు ఆడటం కొనసాగించాడు.

మానసిక వైద్యులు, వైద్యుల బృందం ప్రస్తుతం బాలుడికి అవసరమైన వైద్య సహాయం అందజేస్తోంది. అతను వారి సంరక్షణలో మెరుగుదల సంకేతాలను చూపించడం ప్రారంభించాడు.బాలుడి తల్లి ఇంటి సహాయకురాలిగా పనిచేస్తుండగా, అతని తండ్రి రిక్షా పుల్లర్.


మొబైల్ గేమింగ్‌కు అలవాటు పడిన కారణంగా, బాలుడు తన ప్రాథమిక అవసరాలను, ఆహారాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. అతను తరచుగా తన నిద్రలో గట్టిగా అరవడం లాంటివి చేసేవాడట. అతని చేతులు మొబైల్ స్క్రీన్‌పై గేమ్ ఆడుతున్నట్లుగా కదిలిస్తూనే ఉండేవాడట.
సమస్యను పరిష్కరించడానికి,  అతనికి సరైన చికిత్స అందించే ప్రయత్నంలో, అతని పరిస్థితి మరింత దిగజారడంతో కుటుంబం మొదట జైపూర్‌లోని ఆసుపత్రిలో వైద్య సహాయం కోరింది.ప్రస్తుతం, అతను అల్వార్‌లోని హాస్టల్‌లో ఉంచారు.  అక్కడ కౌన్సెలర్లు అతనిని నిశితంగా గమనించి, చికిత్స అందిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం