ట్రైన్ ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు విద్య అందిస్తాం: అదానీ గ్రూప్

Published : Jun 04, 2023, 08:03 PM IST
ట్రైన్ ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు విద్య అందిస్తాం: అదానీ గ్రూప్

సారాంశం

బిలియనీర్ గౌతమ్ అదానీ ఆదివారం ట్విట్టర్‌లో కీలక ప్రకటన చేశారు. ఒడిశా ట్రైన్ ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు ఉచిత విద్య అందించాలని అదానీ గ్రూప్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. బిలియనీర్ గౌతమ్ అదానీ ఆదివారం ట్విట్టర్‌లో కీలక ప్రకటన చేశారు. ఒడిశా ట్రైన్ ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు ఉచిత విద్య అందించాలని అదానీ గ్రూప్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.  

న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఒడిశాలోని బాలాసోర్ రైళ్ల ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు ఉచితంగా పాఠశాల విద్య అందిస్తామని ప్రకటించింది. ఒడిశా ట్రైన్ ప్రమాదంలో దిగ్భ్రాంతి కలిగించిందని వివరించింది.

పోర్టులు మొదలు ఎనర్జీ వరకు ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లు, ఇతర అనేక రంగాల్లో బలమైన ముద్ర వేసుకున్న అదానీ గ్రూప్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించింది.

‘ఒడిశాలోని ట్రైన్ యాక్సిడెంట్‌తో మేం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాం. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు అదానీ గ్రూప్ ఉచిత పాఠశాల విద్య అందించాలని నిర్ణయం తీసుకుంటుంది. బాధితులు, వారి కుటుంబాలకు అండగా నిలబడటం సమిష్టి బాధ్యత. వారి పిల్లలకు మెరుగైన రేపటిని అందించడం కూడా మనందరి బాధ్యత’ అని అదానీ గ్రూప్ హిందీలో ట్వీట్ చేసింది.

Also Read: గేదెలు, ఎద్దులను వధిస్తుండగా.. ఆవులను వధిస్తే తప్పేంటీ?: కర్ణాటక మంత్రి కే వెంకటేశ్

ఒడిశాలో మూడు ట్రైన్లు ఢీకొట్టుకున్నాయి. మూడు దశాబ్దాల్లో ఇది అత్యంత దారుణమైన ప్రమాదం. ఇందులో సుమారు 300 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు