దొంగల చేతిలో జార్ఖండ్‌ నటి హతం.. చోరీని ప్రతిఘటించడంతో కాల్పులు!

Published : Dec 29, 2022, 05:17 AM ISTUpdated : Dec 29, 2022, 05:20 AM IST
దొంగల చేతిలో జార్ఖండ్‌ నటి హతం..  చోరీని ప్రతిఘటించడంతో కాల్పులు!

సారాంశం

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. జార్ఖండ్‌కి చెందిన సినీ నటి రియా కుమారిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో నేషనల్ హైవేపై బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అయితే..ఈ ఘటనపై రియా కుమారి భర్త ప్రకాశ్ కుమార్ పొంతన లేని సమాధానాలు చెబుతుంటే.. రియా కుమారి హత్య అనుమానాస్పదంగా ఉందని హౌరా పోలీసులు చెబుతున్నారు.

జార్ఖండ్ నటి రియా కుమారి హత్య : టీవీ నటి తునీషా శర్మ మరణానంతరం సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తాజాగా మరో నటి మరణ వార్త తెరపైకి వచ్చింది. జార్ఖండ్‌కి చెందిన ప్రముఖ సినీ నటి రియా కుమారిని గుర్తుతెలియని దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో నేషనల్ హైవేపై బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. నటి రియా కుమారి మృతితో  సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 

అసలేం జరిగింది?

నటి రియా కుమారి,  తన భర్త ఫిల్మ్ మేకర్  ప్రకాష్ కుమార్, రెండేళ్ల కుమార్తెతో కలిసి కోల్‌కతా వైపు జాతీయ రహదారి 16 పై వెళుతుండగా.. ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని అడ్డగించారు. ప్రకాశ్‌కుమార్‌పై దాడి చేసిన అగంతకులు అతని వద్దనున్న సొమ్మును దొంగిలించే ప్రయత్నం చేశారు. దీంతో రియాకుమారి అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో దుండగులు ఆమెపై కాల్పులు జరుపడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రియా భర్త ప్రకాష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే, ఈ ఘటనపై రియా కుమారి భర్త ప్రకాశ్ కుమార్  పొంతన లేని సమాధానాలు చెబుతుంటే.. విచారణ చేస్తున్న పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియా కుమారి హత్య అనుమానాస్పదంగా ఉందని హౌరా పోలీసులు చెబుతున్నారు. ప్రకాశ్ కుమార్ చెప్పిన ఇచ్చిన ఈ వాంగ్మూలమే పోలీసులకు ఎన్నో అనుమానాలకు, ఇంకెన్నో సందేహాలకు తావిస్తున్నాయని సమాచారం. 

'ఇషా అలియా' పేరుతో ఫేమస్ 

దివంగత నటి రియా కుమారి మృతి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆమె ఆకస్మిక నిష్క్రమణపై నటి అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ సినిమాలో రియాను 'ఇషా అలియా' అని పిలుస్తారు. ఆమె సినీ ప్రపంచంలో ఈ పేరుతోనే సుపరిచితం. నటి ఖోర్తా మరియు ప్రాంతీయ భాషల ఆల్బమ్‌లలో ఇషా అలియా పేరుతో జార్ఖండ్‌లో పనిచేసింది. జార్ఖండ్‌లోని జానపద సీరియల్ 'వో చల్‌చిత్ర'లో రియా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. రియా 22 ఏళ్ల చిన్న వయస్సులోనే జార్ఖండ్ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్థానిక టీవీ సీరియల్స్‌తో పాటు, రియా మ్యూజిక్ వీడియోలు యూట్యూబ్‌లో నటించింది. నటి ఆకస్మిక మరణం స్థానిక చిత్రసీమను దిగ్భ్రాంతికి గురి చేసింది.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu