ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు: జమ్మూకాశ్మీర్ భద్రతా పరిస్థితిపై అమిత్ షా హైలెవెల్ మీటింగ్..

By Rajesh KarampooriFirst Published Dec 29, 2022, 3:31 AM IST
Highlights

అమిత్ షా సమీక్షా సమావేశం:'ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు, దానిని ప్రోత్సహించే పరిస్థితులను కూడా అంతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇటీవలి నెలల్లో జమ్మూ కాశ్మీర్‌లో అడపాదడపా హింసాత్మక సంఘటనలు జరిగాయని, ఇందులో పౌరులు, భద్రతా సిబ్బందిపై దాడులు, సరిహద్దు ఆవల నుండి చొరబాటు ప్రయత్నాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

అమిత్ షా సమీక్షా సమావేశం: ఇటీవల జమ్మూకాశ్మీర్‌ లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. తరుచు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్, లద్దాఖ్‌కు సంబంధించి కేంద్రహోంమంత్రి అధ్యక్షతన బుధవారం కీలక సమావేశం జరిగింది. లేహ్-లద్దాఖ్ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి, జమ్మూ కాశ్మీర్ సమస్యపై  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్టు హోంశాఖ కార్యాలయం తెలిపింది.

ఈ సమావేశంలో ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, ఎన్ఐఏ చీఫ్, రా చీఫ్, పారామిలటరీ బలగాల సీనియర్ అధికారులు, జమ్మూ కాశ్మీర్ పరిపాలన, పోలీసులు హాజరయ్యారు. విశేషమేమిటంటే.. జమ్మూలో భద్రతా బలగాలు సాధించిన ఘనవిజయం తర్వాత ఈ సమావేశం జరగడం. బుధవారం (డిసెంబర్ 28) ఉదయం జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ నుండి వచ్చిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఉగ్రవాదంపై కఠిన చర్యలకు సూచనలు

జమ్మూ కాశ్మీర్‌ భద్రతాపై జరిగిన ఈ కీలక సమావేశంలో ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ పాలసీని హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపైనా లేదా వారికి సహాయకులుగా ఉన్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, ఆదుకునే "ఎకోసిస్టమ్"ను నిర్వీర్యం చేయాలని సూచించారు. 

దీనితో పాటు హోం మంత్రి అమిత్ షా జమ్మూ మరియు కాశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు, అలాగే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు గరిష్ట సంఖ్యలో ప్రజలకు ఎలా చేరేలా చూడాలో ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా..జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవలి నెలల్లో అక్కడక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఇందులో అమాయక పౌరులు, భద్రతా సిబ్బందిపై దాడులు, సరిహద్దుల ఆవల నుంచి చొరబాటుకు యత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు సూచనలు కూడా చేశారు.

జమ్మూలోని సిధ్రాలో భారీ కుట్ర 

జమ్మూ కాశ్మీర్‌ భద్రతాపై ఢిల్లీలో జరిగిన ఈ భారీ సమావేశానికి కొన్ని గంటల ముందు.. జమ్మూలోని సిధ్రాలో భద్రతా బలగాలు ఘన విజయాన్ని సాధించాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సిధ్ర తావి వంతెన సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద ఈ ఉదయం గడ్డితో కూడిన ట్రక్కు కాశ్మీర్‌కు వెళుతోంది. ఈ సమయంలో ట్రక్ డ్రైవర్ ట్రక్కును నడపడానికి అధికారులు ప్రయత్నించారు. కానీ ఆ ట్రక్కు డైవర్ మాత్రం ఆపకుండా.. వెళ్లిపోయాడు.

భద్రతా దళాలపై గ్రెనేడ్లు విసిరారు. దీంతో  అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు దాడికి దిగాయి. కొంతసేపటికి నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటనపై జమ్మూ పోలీస్ చీఫ్ మాట్లాడుతూ..“ట్రక్కు నంబర్ ప్లేట్ నకిలీదని తేలింది. ఇంజిన్ , ఛాసిస్ నంబర్లు కూడా తారుమారు చేయబడ్డాయనీ, ఈ విషయంలో ఫోరెన్సిక్ బృందం సహాయం తీసుకుంటుంది. హతమైన ఉగ్రవాదుల వద్ద నుంచి ఏడు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఎం4 రైఫిల్, మూడు పిస్టల్స్, 14 గ్రెనేడ్లతో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

click me!