హోలీ సంబురాలు జరుగుతుండగా.. యాసిడ్ విసిరిన దుండగుడు.. బాధితుడు స్పాట్‌లోనే దుర్మరణం

Published : Mar 19, 2022, 05:44 PM ISTUpdated : Mar 19, 2022, 05:45 PM IST
హోలీ సంబురాలు జరుగుతుండగా.. యాసిడ్ విసిరిన దుండగుడు.. బాధితుడు స్పాట్‌లోనే దుర్మరణం

సారాంశం

బిహార్‌లో అందరూ హోలీ ఆడుతుండగా.. ఒకరు యాసిడ్ చేతిలో పట్టుకుని బయట అడుగుపెట్టాడు. అదే పర్వదినాన నదా గ్రామంలో ఓ వ్యక్తిపై పోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత వ్యక్తి స్పాట్‌లోనే మరణించాడు. 

పాట్నా: బిహార్‌లో హోలి పర్వదినాన దుర్ఘటన చోటుచేసుకుంది. హోలి సందర్భంగా అందరూ రంగులతో సంబురాలు జరుపుకుంటుంటే.. ఓ దుండగుడు అదే అదునుగా తీసుకున్నాడు. ఓ వ్యక్తిపై యాసిడ్ విసిరాడు. యాసిడ్ దాడికి గురైన వ్యక్తి అక్కడికక్కడే స్పాట్‌లోనే మరణించాడు. ఈ ఘటన బిహార్‌లోని నలంద జిల్లాలో జరిగింది. 

నలంద జిల్లా నదా గ్రామంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని నలంద జిల్లా హిల్సా  రేంజ్ ఎస్‌డీపీవో అధికారి క్రిష్ణ మురారీ ప్రసాద్ తెలిపారు. బాధితుడిని గుర్తించే పనిలో ఉన్నామని వివరించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపామని పేర్కొన్నారు. ఈ దాడి చేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. కానీ, నిందితుడిని గుర్తించామని, ఆయన పరారీలో ఉన్నాడని వివరించారు.

యాసిడ్ దాడి జరిగినట్టు తెలియగానే స్థానిక పోలీసులు వెంటనే స్పాట్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడ పెద్దమొత్తంలో గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. పోలీసులు అక్కడకు చేరగానే.. స్థానికులపై ఆ పోలీసులపై రాళ్లు విసిరేశారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని వివరించారు. ఈ గ్రామంలో శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి, సామరస్యాన్ని  పెంచడానికి పెద్ద మొత్తంలో పోలీసులు ఆ గ్రామంలోనే క్యాంప్ వేశారని తెలిపారు.

యాసిడ్ దాడికి పాల్పడిన నిందతుడు కూడా గ్రామానికి చెందినవాడని, స్థానికులు ఆ నిందితుడి ఇంటిపై దాడి చేశారనీ కొన్ని ర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిందితుడి కుటుంబం తమ దగ్గరే ఉన్నారని, వీరి ద్వారా నిందితుడు లొంగిపోవడానికి ఒత్తిడి తెస్తున్నమని పోలీసులు వివరించారు.

హోలీ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని బాంగాంగ్ ఏరియాలో పూటుగా తాగిన ఓ వ్యక్తి మిత్రులతో కలిసి చిందులు వేశాడు. పెద్దగా సౌండ్ పెట్టుకుని స్టెప్పులు వేశాడు. ఇలా ఓ స్టంట్ వేయబోయి చేతిలోని కత్తితో చాతిలో పొడుచుకున్నాడు. నాలుగు సార్లు పొడుచుకున్నాక గానీ, ఆయన రియలైజ్ కాలేడు. రక్తం కారుతుంటే చూసుకుని వెంటనే పక్కకు తప్పుకున్నాడు. బంధు మిత్రులు అది గమనించి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్టు వైద్యులు చెప్పారు.

మధ్యప్రదేశ్‌లోని బాంగాంగ ఏరియాలో గోపాల్ సోలాంకి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆ రాత్రి పూట ఇంటి ముందు సౌండ్ బాక్సులు పెట్టుకుని మిత్రులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఎందుకో గానీ, ఆయన తన చేతిలోకి కత్తి తీసుకున్నాడు. కొంత సేపు మ్యూజిక్‌కు అనుగుణంగా మత్తులోనే తూలుతూ కనిపించాడు. పాటకు తగినట్టుగా ఆయన ఓ స్టెప్ వేయబోయాడు. చేతిలో తాను కత్తి పట్టుకున్నాననే విషయాన్ని మరిచిపోయాడు. గుండెపై చేయి వేస్తూ స్టెప్ వేయాలి అని అనుకున్న గోపాల్ సోలాంకి చేతిలో కత్తితోపాటుగా అలాగే.. గుండెపై నాలుగు సార్లు పోటు పొడుచుకున్నాడు. ఆ కత్తి గోపాల్ సోలాంకి చాతిలోకి దిగింది. నాలుగు పోట్లు పడ్డాయి. వెంటనే రక్తం బయటకు చిమ్మింది. చేయి రక్తంతో తడి కావడంతో వెంటనే ఆయన తన చాతి వైపు చూసుకున్నాడు. చాతిలో నుంచి రక్తం ధారలా బయటకు పొంగింది. వెంటనే జరిగిన ముప్పును గుర్తించి డ్యాన్స్ చేసే స్థలం నుంచి తప్పుకున్నాడు. కానీ, ఆయనతో డ్యాన్స్ చేస్తున్నవారు అది కూడా గమనించకుండా స్టెప్పులు వేస్తూనే ఉన్నారు. ఈ తతంగమంతా కెమెరాలో రికార్డ్ అయింది.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !