ఎంపీఐ ఇండెక్స్ క్షేత్ర స్థాయిలో మెరుగుదలను సూచిస్తుంది.. వెల్లడించిన పీఎంవో

By team teluguFirst Published Nov 27, 2021, 4:43 PM IST
Highlights

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5 2019-20) నిర్వహించిన  ఐదవ సర్వే ప్రాథమిక ఫలితాలు సంక్షేమ లక్ష్యాలలో మెరుగుదలను సూచించాయని, ప్రాథమిక అవసరాల కొరత తగ్గిందని సూచించిందని పీఎంవో (PMO)  తెలిపింది. 

గ్లోబల్ ఎంపీఐ- 2021లో భారతదేశం.. 109 దేశాలలో 66వ స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కారణంగా దేశం అభివృద్ది బాటలో ప్రయాణిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. 2016 నుంచి 2020 మధ్యకాలంలో అభివృద్ది జరిగినట్టుగా కేంద్రం భావిస్తున్నట్టుగా పీఎంవో తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ కుటుంబ ఆరోగ్య (NFHS-5 2019-20) నిర్వహించిన  ఐదవ సర్వే ప్రాథమిక ఫలితాలు సంక్షేమ లక్ష్యాలలో మెరుగుదలను సూచించాయని, ప్రాథమిక అవసరాల కొరత తగ్గిందని సూచించిందని పీఎంవో తెలిపింది. 

నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) తదుపరి ఎడిషన్ వచ్చినప్పుడు.. అది మరింత మెరుగుపడుతుందని పీఎంవో కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 24న విడుదల చేసిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ గణాంకాలు ప్రారంభ దశను పరిశీలిస్తే చాలా ప్రోత్సాహకరంగా కనిపిస్తున్నాయని పీఎంవో తెలిపింది. స్వచ్ఛమైన వంట ఇంధనం, పారిశుధ్యం, విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలని నివేదిక సూచించిందని చెప్పింది. గతంతో పోలిస్తే కొరత తగ్గినట్టుగా పేర్కొంది. 

‘22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం విడుదల చేసిన రాష్ట్ర నివేదికలు పాఠశాల హాజరు, తాగునీరు, బ్యాంకు ఖాతాలు, గృహాల కొరతను తగ్గించాలని సూచిస్తున్నాయి. ఈ మెరుగుదలలు NFHS 5 (2019-20) గృహ మైక్రో డేటా ఆధారంగా రాబోయే సూచికలో బహుమితీయ పేదరికం యొక్క సంభావ్యత తగ్గింపు  మొత్తం దిశను సూచిస్తున్నాయి’ అని PMO తెలిపింది.

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ నాలుగో సర్వే నుంచి ప్రధాన పథకాల ద్వారా పొందిన ప్రయోజనాలు ఐదో సర్వే ప్యాక్ట్‌షీట్‌లో, జాతీయ ఎంపీఐ ఆధారంగా తదుపరి నివేదికలలో కూడా ప్రతిబింస్తున్నాయిన పీఎంవో తెలిపింది. 2015-16 మరియు 2019-20 మధ్య బహుమితీయ పేదరికం తగ్గింపును జాతీయ ఎంపీఐ నివేదిక స్పష్టంగా చూపుతుందని తెలిపింది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ ఐదో సర్వే యూనిట్ స్థాయి డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ నివేదిక విడుదల చేయబడుతుందని పేర్కొంది.

NFHS నాలుగో సర్వే తర్వాత.. గృహనిర్మాణం, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్తు, వంట ఇంధనం, ఆర్థిక, పాఠశాల హాజరు, పోషకాహారం, తల్లి మరియు పిల్లల ఆరోగ్యం మొదలైన వాటిని మెరుగుపరిచే దిశలో కీలక పథకాలు ప్రారంభించబడ్డాని పీఎంవో తెలిపింది. వాటిలో కొన్ని.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY), జల్ జీవన్ మిషన్ (JJM), స్వచ్ఛ భారత్ మిషన్ (SBM), ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య), ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY), ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన), (PMJDY), పోషణ్ అభియాన్, సమగ్ర విద్య అని పీఎంవో పేర్కొంది.


మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI)కి నీతి ఆయోగ్ నోడల్ మంత్రిత్వ శాఖగా ఉంది. గ్లోబల్ MPI 2021 ప్రకారం.. భారతదేశం 109 దేశాలలో 66వ స్థానంలో ఉంది. గ్లోబల్ MPIని పునర్నిర్మించడం, సమగ్ర సంస్కరణ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా సమలేఖనం చేయబడిన, అనుకూలీకరించిన భారతదేశ ఎంపీఐని సృష్టించడాన్ని జాతీయ MPI ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.

click me!