
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక కుటుంబం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోమ్నాలోని వైష్ణోదేవి మందిరానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ప్రమాదానికి గురైంది..
నువాపడా-కరీయార్ జాతీయ రహదారిపై సిల్దా గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ.. బోలెరోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని మహసముంద్ జిల్లా కకరా ప్రాంతానికి చెందిన వారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.