బోగీలనే కొట్టేశారు

First Published Jun 8, 2018, 5:22 PM IST
Highlights

బోగీలనే కొట్టేశారు

మనదేశంలో రైల్వే ఆస్తులకు రక్షణ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. కఠినమైన రైల్వే చట్టాలకు భయపడి చాలా మంది వాటిని ముట్టుకోవడానికి కూడా భయపడుతుంటారు. అలాంటిది ఏకంగా రైలు బోగిలే అదృశ్యమయ్యాయి. రాంచీ-ఢిల్లీల మధ్య నడిచే రాజధాని, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించి కొన్ని కొత్త బోగీలను రాంచీ రైల్వే డివిజన్ యార్డులో ఉంచారు. అయితే అవి ఇప్పుడు కనిపించకుండా పోవడం అధికారులను షాక్‌కు గురిచేసింది. దీంతో కొత్త వాటి స్థానంలో పాత వాటితోనే పని కానిచ్చేస్తున్నారు. వీటి అదృశ్యం వెనుక ఎదైనా ముఠా హస్తం ఉందా..? ఇంటి దొంగలే ఈ పనిచేశారా..? ఇలా కారణాన్ని ఒక్కొక్కరు ఒక్క కథనాన్ని వినిపిస్తున్నారు. అయితే కొందరు అధికారులు మాత్రం ఏసీ బోగీలు కనిపించకుండా పోయిన ఘటనపై స్పందిస్తూ.. పొరపాటున వీటిని మరో రైలుకు అనుసంధానం వ్యక్తం చేసి ఉండవచ్చని.. నార్తరన్ డివిజన్‌లోని ఇవి తిరుగుతున్నట్లుగా భావిస్తున్నామని.. ఈ ఏసీ బోగీలను తిరిగి తమకు అప్పగించాలంటూ నార్తరన్ రైల్వేకు సౌత్ ఈస్ట్రన్ రైల్వే అధికారులు లేఖ రాశారు.. అతి త్వరలోనే అవి తిరిగి రాంచీకి చేరుకుంటాయని వారు తెలిపారు.

click me!