మహువాకు పోరాడే సత్తా ఉన్నది.. ఏమీ తేలకున్నా ఎంపీ పదవిపై వేటుకు సిరఫారసులా?: అభిషేక్ బెనర్జీ

By Mahesh K  |  First Published Nov 9, 2023, 3:28 PM IST

మహువాకు పోరాడే సత్తా ఉన్నది. ఆమె యుద్ధాన్ని స్వయంగా ఎదుర్కోగల శక్తి ఆమెకు ఉన్నది. ఆమెపై ఆరోపణలేవీ నిరూపణ కాకున్నా పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయాలని ఎథిక్స్ కమిటీ ఎలా సిఫారసులు చేస్తుంది? అని టీఎంసీ నేషనల్ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ ప్రశ్నించారు.
 


కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ ఈ రోజు మహువా మోయిత్రా గురించి వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులో పార్లమెంటు ఎథిక్స్ కమిటీ విచారణను ఎదుర్కొంటున్న మహువా మోయిత్రా గురించి మొదటి నుంచి టీఎంసీ పార్టీ కొంత మౌనం వహించింది. తాజాగా, అభిషేక్ బెనర్జీ ఆమె గురించి మాట్లాడారు. 

‘ప్రభుత్వాన్ని, అదానీ అక్రమాల గురించి ప్రశ్నిస్తే.. ఓ ఎంపీ సస్పెండ్ అయ్యారు. ఎథిక్స్ కమిటీ రిపోర్టు చదివితే.. మోయిత్రా గురించి ఏమైనా అవకతవకలు కనిపిస్తే అప్పుడు దర్యాప్తు చేపట్టాలి. కానీ, ఆమె అవకతవకాలేమీ లేనప్పుడు ఎంపీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఎలా సిఫారసు చేస్తారు? ఇది నా ప్రశ్న. మహువా మోయిత్రా ఆమె పోరాటాన్ని పోరాడ గల సత్త ఉన్న మహిళ’ అని అభిషేక్ బెనర్జీ అన్నారు.

Latest Videos

‘ఎథిక్స్ కమిటీ ముందు మరెన్నో ప్రివిలేజెస్ పెండింగ్‌లో ఉన్నాయి. పార్లమెంటు గౌరవాన్ని రమేశ్ బిధూరి ఎలా దిగజార్చారో మనమంతా చూశాం. అనేక బీజేపీ ఎంపీలకు వ్యతిరేకంగా ప్రివిలేజెస్ ఉన్నాయి. కానీ, అవి ముందుకు కదలడం లేదు. వారు కేవలం ప్రతిపక్ష ఎంపీలనే టార్గెట్ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Also Read: బీఆర్ఎస్ ర్యాలీలో అపశృతి : ప్రచార వాహనం పై నుంచి పడిపోయిన కేటీఆర్‌ .. కాస్తలో తప్పిపోయిందిగా

‘ఈడీ నాకు సమన్లు పంపుతున్నది. వారికి ఏమీ తప్పు జరిగినట్టు కనిపించడం లేదు. అందుకే ఒక కేసులో నిర్దోషిగా బయటపడితే మరో కేసులో ఇరికిస్తున్నారు. ఇదే వారి స్టాండర్డ్ ప్రాక్టిస్’ అని విమర్శించారు.

ఈ రోజు కోల్ కతాలోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత అభిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.

click me!