టిండర్ లో టార్గెట్.. వలపువల వేసి, కిడ్నాప్ చేసి.. బిజినెస్ మ్యాన్ అపహరణలో వెలుగులోకి సంచలన విషయాలు...

By AN TeluguFirst Published Oct 27, 2021, 8:50 AM IST
Highlights

నిందితురాలు జైలులో ఉన్నప్పుడు modus operandi of extortion విధానాన్ని నేర్చుకుంది. వీరు ముందుగా డేటింగ్ యాప్ టిండర్ ద్వారా యువకులను టార్గెట్  చేసుకుంటారు. ఆ తర్వాత అచ్చు సినిమాల్లో చూపించినట్టుగా కిడ్నాప్, బెదిరింపు, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ, బాధితులను దోచుకుంటున్నారు

న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీకి చెందిన ప్లైవుడ్ వ్యాపారిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. అతన్ని ఇంటికి తీసుకెళ్లిన తరువాత, ఆమె ముఠా సభ్యులు దోచుకున్నారు. దోచుకునే ముందు అతనిని బట్టలు విప్పి కొట్టారు. ఆ తరువాత అతడిని విడుదల చేసేందుకు రూ.7 లక్షలు డిమాండ్ చేశారు. 

ఈ ఘటనలో ద్వారకా జిల్లా పోలీసులు sextortion కు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు.  ముగ్గురు మహిళలతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సూత్రధారి సోనూ సూరి కూడా ఉన్నారని డీసీపీ (ద్వారక) శంకర్ చౌదరి తెలిపారు. 

“నిందితురాలు జైలులో ఉన్నప్పుడు modus operandi of extortion విధానాన్ని నేర్చుకుంది. వీరు ముందుగా డేటింగ్ యాప్ టిండర్ ద్వారా యువకులను టార్గెట్  చేసుకుంటారు. ఆ తర్వాత అచ్చు సినిమాల్లో చూపించినట్టుగా కిడ్నాప్, బెదిరింపు, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ, బాధితులను దోచుకుంటున్నారు”అన్నారాయన.

“ఏసీపీ అనిల్ దురేజా, ఎస్‌హెచ్‌ఓ సురీందర్ సంధు నేతృత్వంలోని బృందం ఈ దాడిని నిర్వహించింది. ఈ దాడిలో పోలీసులు ఫైల్ కవర్లు, దోపిడీ చేసిన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా పలువురిని ఇలాగే బలవంతంగా extorted చేసినట్లు విచారణలో వెల్లడైంది, వారి వివరాలను ధృవీకరిస్తున్నట్లు చౌదరి తెలిపారు.

అక్టోబరు 23న బాధిత వ్యాపారి నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముఠాను ట్రాక్ చేయడం ప్రారంభించారు. victim తన ఫిర్యాదులో, ప్లైబోర్డు కొనుగోలుకు సంబంధించి తనను కలవాలని కోరుతూ తనకు కాల్ వచ్చిందని చెప్పాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 21న కలవాలని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు వ్యాపారవేత్త జనక్‌పురిలో మహిళను కలిశాడు.  ఆమె అతన్ని ఒక ఇంటికి తీసుకు వెళ్లింది. అక్కడ అతనికి drink ఇచ్చింది. అది తాగిన తరువాత అతను unconscious అయ్యాడు.

తరువాత స్పృహ వచ్చేసరికి అతను ఒక మంచం మీద అభ్యంతరకరమైన స్థితిలో ఉన్నాడు. గదిలో 5-6 మంది మహిళలు, మరియు ముగ్గురు పురుషులు నిలబడి ఉన్నారు. వారు అతడిని కొట్టి అతని వద్ద ఉన్న రూ.15,700 పర్సు, చేతి గడియారం, బంగారు ఉంగరం దోచుకున్నారు. అతన్ని విడుదల చేయడానికి రూ. 7 లక్షలు డిమాండ్ చేశారు. ఈ దోపిడీకి అంగీకరించకపోతే చంపేస్తామని బెదిరించారు.

ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, వ్యాపారవేత్తను contact చేయడానికి నిందితురాలు ఉపయోగించిన ఫోన్ నంబర్‌పై నిఘా పెట్టారు. కాల్ వివరాలను విశ్లేషించి గ్యాంగ్ గురించిన పూర్తి సమాచారాన్ని పోలీసుల బృందం సేకరించింది. విచారణలో దోషి సూరినే ప్రధాన సూత్రధారిగా తేలింది. ముఠా దాగున్న స్థలంలో దాడులు నిర్వహించిన పోలీసులు, ఐదుగురు నిందితులను పట్టుకున్నారు.

నాలుగేళ్లుగా అక్కతో.. తరువాత మైనర్ చెల్లిపై అత్యాచారం.. వీడియో తీసి ఓ బెదిరింపు.. చివరికి...

ఈ gang లోని ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంది. ఒకరు హనీట్రాప్ వేస్తే, మరొకరు పోలీసుగా పోజులిస్తారు. 60 ఏళ్ల వృద్ధుడు జడ్జిగా నటస్తూ బీకాన్‌ అమర్చిన వాహనంలో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. “నిందితురాలు శివాని tinder ద్వారా ఎవరికి టార్గెట్ చేయాలో చూసుకుని, వారి నెంబర్లు సేకరించేది. ఆ తరువాత ఆమె ఆ నెంబర్లను శీతల్ అరోరా అలియాస్ పూజకు ఇచ్చేది. ఆమె targets ను మాయమాటలతో ప్రలోభపెట్టేంది. చివరికి తమ బుట్టలో పడ్డవారిని తమ సహచరురాలు రేవతి నివాసానికి ఆహ్వానించేది”అని డిసిపి చెప్పారు.

ఈ ముఠా బాధితులను నగ్నంగా వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ కు తెగబడేది. ఈ గ్యాంగ్ లోని ఇతర నిందితులు హర్విందర్ సింగ్ (60), వైభవ్‌లు ఆ గదిలోకి వెళ్లి టార్గెట్‌లపై అత్యాచారం కేసు నమోదు చేస్తామని బెదిరిస్తారు.. అని పోలీసులు తెలిపారు. 
 

click me!