నాలుగేళ్లుగా అక్కతో.. తరువాత మైనర్ చెల్లిపై అత్యాచారం.. వీడియో తీసి బెదిరింపు.. చివరికి...

Published : Oct 27, 2021, 08:12 AM ISTUpdated : Oct 27, 2021, 08:50 AM IST
నాలుగేళ్లుగా అక్కతో.. తరువాత మైనర్ చెల్లిపై అత్యాచారం.. వీడియో తీసి బెదిరింపు.. చివరికి...

సారాంశం

కమలకు ఇష్టం లేకపోయినా  ప్రతాప్ తో closeగా మెలగాలి వస్తుండేది.  అలా ఒకరోజు కమలను కలిసేందుకు పుష్ప హోటల్ కి వచ్చినప్పుడు..  వారిద్దరిని తన కారులో షికారు కి తీసుకెళ్ళాడు ప్రతాప్.  అక్కడ ఇద్దరికీ కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఈసారి పుష్పపై molestaionకి పాల్పడ్డాడు. మళ్లీ వీడియో కూడా తీశాడు.

మధ్యప్రదేశ్ : దేశంలో స్త్రీలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి కేసులు రోజూ పదుల సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి.  ఇలాంటి ఓ క్రూర ఘటన రాష్ట్రంలోని జబల్పూర్ నగరంలో ఇటీవలే జరిగింది.  ఒకేసారి ఇద్దరు యువతులు.. అది కూడా వారిద్దరూ అక్కచెల్లెళ్ళు.. తమపై ఒకే వ్యక్తి అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అందులోఆ చెల్లెలు మైనర్ కావడం విశేషం. 

నిందితుడు ప్రతాప్ జబల్పూర్ నగరంలోని ఒక త్రీ స్టార్ హోటల్ లో కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అదే హోటల్లో కమల (పేరు మార్చబడినది)పార్ట్ టైం జాబ్ చేస్తోంది. కమల నర్సింగ్ విద్యార్థిని కూడా.

తమ కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ఆ హోటల్ లో 2017 వ సంవత్సరం నుంచి పనిచేస్తుంది. ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న ప్రతాప్ కమలతో సన్నిహితంగా మెలిగే వాడు. అలా 2017 లో ఒకరోజు కూల్డ్రింక్ ఇచ్చాడు.

ఆ కూల్ డ్రింకులో Narcotics కలపడం వల్ల cool drinkతాగిన తర్వాత కమల స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత Pratap కమల పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  ఇదంతా video తీశాడు.  అప్పటినుంచి ఆ వీడియోని ఇంటర్నెట్లో వైరల్ చేస్తాం అని black mail చేసి ఆమెపై నాలుగేళ్లుగా rape చేస్తూనే ఉన్నాడు.

ఇటీవల  2021 మార్చి  కమల చెల్లెలు పుష్ప (17, పేరు మార్చబడినది)  కూడా చదువుకునేందుకు జబల్పూర్ కు వచ్చింది.  ఈ క్రమంలో పుష్ప కూడా హోటల్ కు తన అక్కను కలుసుకునేందుకు అప్పుడప్పుడూ వచ్చేది. ఇది గమనించిన ప్రతాప్ పుష్ప మీద కూడా కన్నేశాడు.  ఎలాగైనా ఆమెను కూడా పొందాలనుకున్నా డు.

సొంత చెల్లిని వ్యభిచారంలోకి దింపిన అక్క.. ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో..

కమలకు ఇష్టం లేకపోయినా  ప్రతాప్ తో closeగా మెలగాలి వస్తుండేది.  అలా ఒకరోజు కమలను కలిసేందుకు పుష్ప హోటల్ కి వచ్చినప్పుడు..  వారిద్దరిని తన కారులో షికారు కి తీసుకెళ్ళాడు ప్రతాప్.  అక్కడ ఇద్దరికీ కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఈసారి పుష్పపై molestaionకి పాల్పడ్డాడు. మళ్లీ వీడియో కూడా తీశాడు.

Consciousness వచ్చాక కమల పుష్ప ఇద్దరికీ జరిగింది తెలిసి ఏడ్చారు. ఏం చేయాలో తెలియలేదు. మళ్లీ ఆ వీడియో చూపించి పుష్ప మీద కూడా అలాగే బలవంతం చేశాడు.  ఇదంతా చూసి కమలకు ఓర్పు నశించింది. తనపై అత్యాచారం జరిగినా సహించిన కమల.. తన చెల్లెలిపై ఇలా జరగడం సహించలేకపోయింది.  

పుష్పను వెంట తీసుకొని మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లి  జరిగిందంతా చెప్పింది. పోలీసులు రెండు వేరువేరు అత్యాచారం ఫిర్యాదును నమోదు చేసుకున్నారు. పుష్ప Minor కావడంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. Accused ప్రతాప్ ను అరెస్టు చేయడానికి వెళ్లగా అతను పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Jio Recharge Plans : కేవలం రూ.11 కే 10GB,రూ.49 కే 25GB హైస్పీడ్ డేటా
Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu