ఆక్సీజన్ వార్.. ఢిల్లీ నాలుగురెట్లు అదనంగా అడిగింది..!

By telugu news teamFirst Published Jun 25, 2021, 2:20 PM IST
Highlights

ఆడిట్  రిపోర్టు ప్రకారం.. ఢిల్లీ కి 300 టన్నుల ఆక్సీజన్ అవసరం కాగా...  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 1200 టన్నులు డిమాండ్ చేయడం గమనార్హం.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్ కమిటీ కీలక విషయాలను వెల్లడించింది. ఢిల్లీ ప్రభుత్వం తన అవసరాలకు మంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఆక్సీజన్ కోరిందని  చెప్పడం గమనార్హం. ఏప్రిల్- మే నెలల్లో ఆక్సీజన్ సరఫరాలో విపరీతమైన కొరత ఏర్పడింది. దీంతో.. చాలా ఆస్పత్రుల్లో రోగులు ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ఢిల్లీ ప్రభుత్వానికీ కేంద్కరానికి  మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

ఆ సమయంలో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకోండంతో.. ఆక్సీజన్ కేటాయింపులు పెంచారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు ఆక్సీజన్ సరఫరా తగ్గించేశారు. తాజాగా వచ్చిన ఆడిట్  రిపోర్టు ప్రకారం.. ఢిల్లీ కి 300 టన్నుల ఆక్సీజన్ అవసరం కాగా...  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 1200 టన్నులు డిమాండ్ చేయడం గమనార్హం. ఈ మేరకు ఢిల్లీ ఎక్కువ ఆక్సీజన్ తీసుకోవడంతో ఇతర రాష్ట్రాలు ఇబ్బంది ఎదుర్కొన్నాయని ఆడిట్ తన నివేదికలో పేర్కొంది.

 మే 13వ తేదీన కూడా ఢిల్లీలోని ఎల్ఎన్‌జేపీ, ఎయిమ్స్‌లాంటి ప్ర‌భుత్వ ద‌వాఖానాల‌తోపాటు వివిధ ప్రైవేటు హాస్పిట‌ల్స్‌లో స‌రిప‌డా ఆక్సిజ‌న్ ఉన్నందుకే ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్లు లోడ్ ఖాళీ చేయ‌లేద‌ని తెలిపింది.

ఏప్రిల్ 29 నుంచి మే 10 మ‌ధ్య ఢిల్లీలో ఆక్సిజ‌న్ వినియోగ లెక్క‌ల‌ను స‌వ‌రించాల‌ని, కొన్ని హాస్పిట‌ల్స్ వీటిలో భారీ త‌ప్పిదాలు చేశాయ‌ని క‌మిటీ తేల్చి చెప్పింది. నిజానికి హాస్పిట‌ల్స్ 1140 మెట్రిక్ టన్నులు వినియోగించిన‌ట్లు చెప్ప‌గా.. లెక్క స‌రిచేసిన త‌ర్వాత అది 209 మెట్రిక్ ట‌న్నులుగా తేలింద‌ని తెలిపింది. డిమాండ్‌ను స‌రిగా లెక్కించ‌లేక ఢిల్లీ ప్ర‌భుత్వం ఇలా అవ‌స‌రం ఉన్న‌దాని కంటే ఎంతో ఎక్కువ ఆక్సిజన్ అడిగింద‌ని క‌మిటీ తేల్చి చెప్పింది.

click me!