ఢిల్లీ అల్లర్లు, ఐబీ అధికారి హత్య: ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్ అరెస్ట్

By Siva KodatiFirst Published Mar 5, 2020, 3:55 PM IST
Highlights

ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, నెహ్రూ విహార్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, నెహ్రూ విహార్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన హత్యలో తాహిర్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.

అంకిత్ శర్మ మృతికి తాహిర్ హూస్సేన్‌దే బాధ్యత అంటూ ఐబీ అధికారి తండ్రి రవీందర్, బంధువులు ఆరోపిస్తున్నారు. తాహిర్ హుస్సేన్ ఇంటికి సమీపంలోనే అంకిత్ మృతదేహం లభించడం గమనార్హం.

Also Read:తాహిర్ హుస్సేన్ మెడకు బిగుస్తున్న ఉచ్చు: ఆప్ నుంచి సస్పెన్షన్

ఈ నేపథ్యంలో ఆప్ ఆయనను పార్టీలోంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాహిర్ కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నించగా.. కోర్టు ఆయన దరఖాస్తును తిరస్కరించింది. దీంతో ఆయనను గురువారం ఢిల్లీ పోలీస్ విభాగంలోని క్రైమ్ బ్రాంచ్ ఇంటర్ స్టేట్ సెల్ అరెస్ట్ చేసింది.

ఇప్పటికే అంకిత్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అల్లర్ల సమయంలో తాహిర్ హుస్సేన్ తన పొరుగు ఇళ్లపైనా బాంబులు విసిరినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

Also Read:అంకిత్ శర్మ హత్యలో ఆప్ నేత పాత్ర: కేజ్రీవాల్ స్పందన ఇదీ...

ఇదే సమయంలో తాహిర్ నివాసంలో జరిగిన సోదాల్లో రాళ్లు, ఇటుకలు, పెట్రోల్ బాంబులు దొరకడం గమనార్హం. అయితే ఇంత జరిగినా తాను అమాయకుడినని తాహిర్ వాదిస్తున్నారు. 

click me!