Aadhaar Card New Guidelines: ఆధార్ జిరాక్స్ ఎవ్వ‌రికీ ఇవ్వొదు.. Masked Aadhaar ని మాత్ర‌మే..

Published : May 29, 2022, 02:45 PM IST
Aadhaar Card New Guidelines: ఆధార్ జిరాక్స్ ఎవ్వ‌రికీ ఇవ్వొదు..  Masked Aadhaar ని మాత్ర‌మే..

సారాంశం

Aadhaar Card New Guidelines:  ఆధార్‌ వాడకంపై కేంద్రం  దేశ పౌరులకు కీలక సూచన చేసింది. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీనైనా సరే ఎవరితోనూ ఎప్పుడూ షేర్ చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు కాపీ దుర్వినియోగమవుతోందని, కావున Masked Aadhaar ను ఉప‌యోగించాల‌ని సూచించింది  .  

Aadhaar Card New Guidelines: ఆధార్ కార్డు.. మ‌న‌ నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధారం.. సిమ్‌ కార్డు నుంచి ఫైట్ ల బుకింగ్ వ‌ర‌కు ఆధార్ తప్పనిసరి. ఈ ఆధార్‌ కార్డు లేనిది ప్ర‌భుత్వం ఆఫీసుల్లో పనులే జరగవు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు సంబంధించి కీలకమైన సూచనలు జారీ చేసింది. ఆధార్ కార్డు జిర్సాక్స్  ఎవ్వరికి ఇవ్వ‌కూడద‌ని, ఆధార్ కార్డు  కాపీని ఇత‌రుల‌కు ఇచ్చేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. ఆధార్ కార్డు న‌క‌లు దుర్వినియోగ జ‌రుగుతున్నాయ‌నే నేప‌థ్యంలో నూత‌న గైడ్ లైన్స్ జారీ చేసింది.  

ఏ విష‌యంలోనైనా ఆధార్ కార్డును ఇత‌రుల‌కు ఇవ్వాల్సి వస్తే.. కేవ‌లం మాస్క్‌డ్ ఆధార్‌ను మాత్రమే ఉపయోగించాలని, ఈ కార్డు ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల‌..  ఆధార్ వివరాలను సురక్షితంగా ఉంటాయని కేంద్రం స్ప‌ష్టం చేసింది.  ముందు జాగ్ర‌త్త‌ కోస‌మే ఇలా సూచ‌న చేస్తున్న‌ట్లు కేంద్రం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.  

 m-Aadhaar యాప్ ఉప‌యోగించండి

యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం కొంతకాలం క్రితం m-Aadhaar యాప్‌ను ప్రారంభించింది. దీన్ని ఎవరైనా Google Play Store లేదా Apple App Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఆధార్ సమాచారం సురక్షితం కాబట్టి ఈ యాప్‌లో అనేక ప్రత్యేక ఫీచర్లు అందించబడ్డాయి. ఉదాహరణ‌కు.. ఈ యాప్‌లో ఆధార్ నంబర్ యాక్టివ్‌గా ఉంటే.. దానిని ఇతర ఫోన్‌ల నుండి యాక్సెస్ చేయడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఫోన్‌ని మార్చినట్లయితే, కొత్త ఫోన్ లో యాప్ యాక్టివేట్ అయిన వెంటనే పాత ఫోన్ లో ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ అవుతుంది.

mAadhaar ప్రతిచోటా చెల్లుబాటు

ఈ యాప్‌లో ఆఫ్ లైన్ కూడా ప‌ని చేస్తుంది. అవసరమైతే.. దీనిని ఐడి ప్రూఫ్‌గా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. m-Aadhaar యాప్ ద్వారా రైల్వే స్టేషన్ల నుండి విమానాశ్రయాల వరకు చెల్లుబాటు అవుతుంది. ప్రభుత్వం తన నూత‌న‌ మార్గదర్శకంలో మాస్క్‌డ్ ఆధార్‌ను ఉపయోగించాలని సూచించింది.  అటువంటి పరిస్థితిలో mAadhaar ఉపయోగం కూడా సురక్షితమైన ఎంపిక అని తెలిపింది..
 
Masked Aadhaar అంటే.. 

యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆన్‌లైన్‌లో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుక‌వ‌చ్చింది.  ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ, చిరునామా, లింగం ఇటువంటి మార్పులు చేసుకునేందుకు వీలుగా రూపొందించింది. దీనినే మాస్క్‌ ఆధార్‌ కార్డ్‌ అని చెబుతున్నారు. ఈ కార్డు పై 12 అంకెల  ఆధార్‌ నంబర్ లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మొదటి ఎనిమిది 8 అంకెల స్థానంలో  ****-**** గా కనిపిస్తాయి. దీంతో.. మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డు.. ఒరిజినల్‌ కార్డును సురక్షితంగా ఉంచుతుంది.

Masked Aadhaar ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

1. https://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి,  ఆధార్ డౌన్‌లోడ్ పై క్లిక్ చేయాలి

2.  త‌రువాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

3. మాస్క్‌డ్‌ ఆధార్  అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
 
4. ధృవీకరణ కోసం.. ఇచ్చిన  క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. 

5.  అనంత‌రం ‘Send OTP’పై క్లిక్ చేయాలి.

6. ఇ-ఆధార్ కాపీను PDF కాపీ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

7. ఆధార్ PDF ఒపెన్ చేయాలంటే..  8 అక్షరాల పాస్‌వర్డ్ ఉంటుంది. (మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు క్యాపిటల్ లో, పుట్టిన సంవత్సరం ఎంటర్‌ చేయాలి.)

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు