పానీ పూరీ తిన్న 97 మంది చిన్నారులకు అస్వస్థత..

Published : May 29, 2022, 02:44 PM IST
పానీ పూరీ తిన్న 97 మంది చిన్నారులకు అస్వస్థత..

సారాంశం

పానీ పూరీ తిన్న 97 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగర్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. 

పానీ పూరీ తిన్న 97 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగర్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. మధ్యప్రదేశ్‌లోని మండలా జిల్లాలో జరిగిన ఒక జాతరలో 'పానీ పూరీ' తిని 97 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్‌తో బాధపడ్డారని ఆరోగ్య అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలోని గిరిజనులు అధికంగా ఉండే సింగర్‌పూర్ ప్రాంతంలో నిర్వహించిన జాతరలో బాధితులంతా శనివారం సాయంత్రం ఒకే దుకాణం నుంచి అల్పాహారం కొనుగోలు చేశారని ఒక అధికారి తెలిపారు. 

అయితే రాత్రి 7.30 గంటల ప్రాంతంలో చిన్నారులు వాంతులు, కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారని జిల్లా ఆస్పత్రి సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ కేఆర్‌ శక్య తెలిపారు. ఫుడ్‌ పాయిజన్‌తో 97 మంది చిన్నారులు జిల్లా ఆసుపత్రిలో చేరారని చెప్పారు. వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఇక, ఆస్పత్రిలో అస్వస్థతకు గురైన చిన్నారులకు అందుతున్న చికిత్సను ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మస్కోలే, జిల్లా కలెక్టర్ హర్షికా సింగ్ పర్యవేక్షిస్తున్నారు.

ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను శనివారం రాత్రి కేంద్ర మంత్రి, Mandla పార్లమెంటు సభ్యుడు Faggan Singh Kulaste పరామర్శించారు. ‘‘గత రాత్రి మా ఏరియా పరిధిలోని సింగర్‌పూర్‌లో సుమారు 60 మంది చిన్నారులకు ఫుడ్‌ పాయిజన్‌ ​​అవడంతో.. మండలా జిల్లా ఆసుపత్రి సీఎంహెచ్‌ఓ, సిఎంఓతో ఫోన్‌లో మాట్లాడి చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు సూచనలు చేశాను’’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. 

 


మరోవైపు పానీ పూరీ అమ్మే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అల్పాహారం నమూనాలను పరీక్ష కోసం పంపామని చెప్పారు. పానీ పూరీ విక్రయదారుడు దోషిగా తేలితే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?