యువతితో లేచిపోయిన యువకుడు..పెళ్లి చేస్తామని పిలిచి ముఖానికి నల్లరంగు పూసి, బూట్ల దండతో ఊరేగింపు.. వీడియో వైరల్

By Asianet NewsFirst Published May 29, 2023, 12:08 PM IST
Highlights

ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుందామని భావించి గ్రామం నుంచి లేచిపోయింది. ఆ గ్రామ పెద్దలు వారికి ఫోన్ చేసి గ్రామానికి రావాలని, తామే ఇక్కడ పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చారు. వారి మాటలు నమ్మి వచ్చిన ఆ ప్రేమికులకు ఘోర అవమానం ఎదురైంది. 

ఆ యువతీ యువకులిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబితే ఎక్కడ తమ ప్రేమకు అడ్డుపడుతారని భావించారో ఏమో తెలియదు గానీ.. ఎవరికీ చెప్పకుండా గ్రామం నుంచి పారిపోయారు. అయితే ఆ గ్రామస్తులు అతడికి ఫోన్ చేసి.. గ్రామంలోనే పెళ్లి జరిపిస్తామని, ఇక్కడికి రావాలని కోరారు. వారి మాటలు నమ్మి గ్రామానికి వచ్చిన తరువాత అతడిని చితకబాది, ముఖానికి నల్లరంగు పూసి, బూట్ల దండ వేసి ఊరేగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మానవత్వం చూపించిన సీఎం సిద్ధరామయ్య.. హత్యకు గురైన బీజేపీ నేత భార్యకు మళ్లీ ఉద్యోగమిస్తామని ప్రకటన

వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుదౌన్ జిల్లా కున్వర్ గావ్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి, 21 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు తమ పెళ్లికి ఒప్పుకోరని భావించి వారిద్దరూ గ్రామం నుంచి లేచిపోయారు. ఈ జంట చండీగఢ్ కు చేరుకొని తలదాచుకుంది.  అయితే పలువురు గ్రామస్తులు యువకుడికి ఫోన్ చేసి ఊరికి రావాలని కోరారు. ఇక్కడే ఇద్దరికి పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు.
సెంగోల్ మొదటి రోజే వంగిపోయింది - ఎంకే స్టాలిన్.. రెజ్లర్లపై పోలీసుల తీరును ఖండించిన తమిళనాడు సీఎం

గ్రామ పెద్దల మాట నమ్మిన ఈ జంట ఊరికి తిరిగి వచ్చింది. దీంతో ఆ యువకుడిపై పలువురు గ్రామస్తులు దాడి చేశారు. అతడిని చితకబాదారు. ముఖానికి నల్లరంగు పూసి, మెడలో బూట్ల దండ వేశారు. అనంతరం గ్రామం చుట్టూ ఊరేగించారు. ఆ సమయంలో కూడా అతడిని కొడుతూనే ఉన్నారు. అయితే ఈ ఘటనను పలువురు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

దారుణం.. ఇస్లాంలోకి మారాలని గర్భవతి అయిన సహజీవన భాగస్వామిపై ఒత్తిడి.. విషప్రయోగం చేయడంతో మృతి..

ఈ వీడియోను చూసిన పోలీసులు హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. యువతి కుటుంబంతో పాటు కొందరు గుర్తుతెలియని గ్రామస్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ మిశ్రా ‘ఎన్డీటీవీ’తో తెలిపారు. అయితే ఆ యువకుడి వివరాలు వెల్లడించలేదు.

click me!