
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతీ యువకుడు కలిసి కదులుతున్న రైలు కింద దూకారు. దీంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. వారి శరీర భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. అయితే ఇందులో యువకుడికి 25 సంవత్సరాల ఉండగా.. యువతికి 17 సంవత్సరాలు ఉంటాయి. వీరిద్దరి ప్రేమికులు అయి ఉంటారని, ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
బుండి జిల్లా లఖేరి రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చనిపోయిన యువకుడిని కమల్ జంగిద్ అలియాస్ కంకుగా పోలీసులు గుర్తించారు. అతడు లఖేరి పట్టణంలోని మలియోన్ కా మొహల్లా కు చెందిన వాడు. మృతురాలు మైనర్ కూడా అదే ప్రాంతానికి చెందినదని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
Uttarakhand Bus Accident : బస్సు లోయలో పడిన ఘటనలో 25కి చేరిన మృతుల సంఖ్య..
లఖేరి పోలీస్ స్టేషన్ SHO ఎస్‌హెచ్‌ఓ ధర్మారం మాట్లాడుతూ.. శని, ఆదివారాల మధ్య తెల్లవారుజామున 3 గంటల సమయంలో కమల్ జంగిద్, ఆ బాలిక తమ ఇళ్ల నుంచి బయలుదేరి లఖేరి రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్ వద్దకు వచ్చారని తెలిపారు. అనంతరం కదులుతున్న రైలు ముందు దూకినట్లు చెప్పారు. వారి శరీర భాగాలు తీవ్రంగా ఛిన్నాభిన్నం అయ్యాయని చెప్పారు. అయితే వారు ఇంతటి దారుణమైన చర్యకు ఎందుకు ఒడిగట్టారో పోలీసులు ఇంకా నిర్దారించలేదు.
ఫుడ్ డెలివరీ బాయ్ ను చెంపదెబ్బలు కొట్టిన కానిస్టేబుల్.. సస్పెండ్ చేసిన అధికారులు..
ఇదే రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలోని గోరియా కాలా గ్రామంలో ఓ యువకుడు, ఓ బాలిక శవమై కనిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ వరుసకు బంధువులు. ఈ యువతీ యువకులు ప్రేమ వ్యవహారంలో మునిగిపోయి ఉన్నారని, వీరు ఆత్మహత్య చేసుకొని మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరి మృతదేహాలు ఒకే చెట్టుకు వేలాడుతూ కనిపించాయి, దీనిని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను కిందకి దించారు. అనంతరం వాటిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీలో ఉంచారు. అయితే ఇది ప్రాథమికంగా ప్రేమ వ్యవహారంగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి సహాయం చేస్తారు.