Rainfall: ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వానలు.. మూతపడ్డ స్కూళ్లు, కార్యాలయాలు

By Mahesh RajamoniFirst Published Sep 23, 2022, 12:29 PM IST
Highlights

Rain Shuts Down Noida: ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు గురువారం కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో, పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి, నగరంలోని కీలక రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ (IMD) కూడా 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. శుక్రవారం నగరంలోని చాలా చోట్ల మోస్తరు వర్షం పడుతుందని ప్రజలను హెచ్చరించింది. 
 

Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు గురువారం కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో, పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి, నగరంలోని కీలక రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ (IMD) కూడా 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. శుక్రవారం ఉదయం నగరంలోని చాలా చోట్ల వర్షం పడింది. ఇంకా మోస్తరు వర్షం పడుతుందని ప్రజలను ఐఎండీ హెచ్చరించింది. ఈ వారాంతం వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశ రాజధానిని వారాంతంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల దృష్ట్యా, శుక్రవారం నోయిడా, గురుగ్రామ్‌లలో పాఠశాలలకు (8వ తరగతి వరకు) సెలవులు ప్రకటించారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో సుదీర్ఘ ట్రాఫిక్ స్తంభనలు నమోదయ్యాయి. మరింత వర్షం కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల సాధారణంగా మేఘావృతమైన ఆకాశం, మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీల సెల్సియస్‌, 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది

భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్, గురుగ్రామ్‌లోని కొన్ని ప్రాంతాలలో పాఠశాలలు మూసివేయబడ్డాయి.  అలాగే, నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రయివేటు, కార్పొరేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి.

తాజా వర్షాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

  • ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫిరోజాబాద్‌లో సాధారణ జనజీవనం దెబ్బతిన్నది. అక్కడ కురుస్తున్న భారీ వర్షం, పిడుగులు పడిన ఘటనతో పాటు గోడలు-ఇల్లు కూలిపోయిన సంఘటనలలో కనీసం 13 మంది మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు.  అలీఘర్‌లోని పాఠశాలలను మూసివేయవలసి వచ్చింది. 
  • ఢిల్లీలో గురువారం సాయంత్రం 5.30 నుండి శుక్రవారం ఉదయం 8.30 గంటల మధ్య 40.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు వరుసగా మూడో రోజు (శుక్రవారం) తేలికపాటి నుండి మోస్తరు వర్షం ఢిల్లీని ముంచెత్తింది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల పై వరదలు పారుతున్నాయి. నగరం అంతటా కీలకమైన రోడ్లపై ట్రాఫిక్ కదలికను ప్రభావితం చేసింది.
  • దేశ రాజధానిలో శుక్రవారం మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా సాధారణం కంటే ఒక మెట్టు ఎక్కువగా నమోదైంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 28 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడే అవకాశం ఉంది.
  • నగరంలోని చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. గౌతమ్ బుద్ధ్ నగర్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా అంతటా 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ప్రైవేట్ పాఠశాలలు వర్షాల కారణంగా ఈ రోజు మూసివేయబడతాయని అధికారిక ఉత్తర్వులు గురువారం ప్రకటించబడ్డాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
  • రోడ్లు, డ్రెయిన్ల మరమ్మత్తు పనులను పౌర సంస్థల ద్వారా సజావుగా నిర్వహించేలా శుక్రవారం నుంచి ఇంటి నుండి పని చేయాలని గురుగ్రామ్ పరిపాలన ప్రైవేట్, కార్పొరేట్ కార్యాలయాలకు సూచించింది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు నిలయమైన మిలీనియం సిటీ, రోడ్ల రద్దీని తగ్గించడానికి పోలీసులు కష్టపడటంతో ట్రాఫిక్ జామ్‌లకు దారితీసిన అనేక ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడింది.
  • ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అన్ని పాఠశాలలు, కళాశాలలను శుక్రవారం మూసివేయాలని అధికార యంత్రాంగం సూచించింది.
  • జిల్లా యంత్రాంగం ప్రకారం, గురువారం గురుగ్రామ్‌లో 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వజీరాబాద్‌లో అత్యధికంగా 60 మిమీ వర్షపాతం నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు మనేసర్‌లో 50, సోహ్నా 43, హర్సర్‌ 54, బాద్‌షాపూర్‌ 30, పటౌడీ 20, ఫరూఖ్‌నగర్‌లో 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
  • జాతీయ రాజధాని ప్రాంతం నుండి రుతుపవనాల ఉపసంహరణకు ముందు తాజా వర్షాలు, పెద్ద లోటును (సెప్టెంబర్ 22 ఉదయం వరకు 46 శాతం) కొంత వరకు భర్తీ చేయడంలో కీలకంగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. 
click me!