ఆన్‌లైన్ క్లాస్‌ చెబుతుండగానే టీచర్ దారుణ హత్య.. జూమ్ సెషన్ లో ఘటన రికార్డ్

By team teluguFirst Published Feb 1, 2023, 12:22 PM IST
Highlights

తన సోదరిని వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ యువకుడిని టీచర్ బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో కోపం పెంచుకున్న ఆ యువకుడు మరో వ్యక్తితో కలిసి టీచర్ హతమర్చాడు. అయితే ఈ ఘటన జూమ్ సెషన్ లో రికార్డు అయ్యింది. 

ఉత్తరప్రదేశ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ట్యూషన్ టీచర్ ఆన్ లైన్ లో క్లాసులు చెబుతున్న సమయంలో ఓ ఇద్దరు దుండగులు అతడిని ఘోరంగా హతమార్చారు. ఈ ఘటన అంతా జూమ్ సెషన్ లో రికార్డు అయ్యింది. వాటి ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

రైజింగ్ డే సందర్భంగా భారత తీర రక్షక దళానికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్‌నగర్‌కు చెందిన కృష్ణకుమార్‌ యాదవ్‌(35) ఓ ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నాడు. అలాగే సాయంత్రం వేళల్లో గణితం, హిందీ సబ్జెక్టులు ట్యూషన్ చెప్పేవాడు. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం కూడా ఆయన జూమ్ యాప్ ద్వారా ఓ బాలికకు క్లాసు చెబుతున్నాడు. అయితే ఈ సమయంలో సందీప్ కుమార్, జగ్గా మిశ్రా అనే ఇద్దరు వ్యక్తులు అతడి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ టీచర్ పై దాడికి పాల్పడ్డారు. 

కేంద్ర బడ్జెట్ 2023 : ఎరుపురంగు టెంపుల్ బార్డర్ చీరలో నిర్మలాసీతారామన్..

దీంతో జూమ్ సెషన్ జరుగుతున్న కృష్ణ కుమార్ యాదవ్ మొబైల్ ఫోన్ కింద పడిపోయింది. కానీ క్లాస్ రికార్డింగ్ మాత్రం ఆగలేదు. ఆ ఇద్దరు దుండగులు టీచర్ ను దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన కూడా అందులో రికార్డు అయ్యిందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనంలో పేర్కొంది. ఆ రికార్డింగ్ నిందితులను గుర్తించడానికి, పట్టుకోవడానికి పోలీసులకు సహాయపడింది. 

ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదగడానికి భారత్ సిద్ధంగా ఉంది: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కాగా.. ఈ ఘటనలో నిందితుడైన సందీప్ కుమార్ ను పోలీసులు విచారించగా తానే నేరాన్ని చేసినట్టు అంగీకరించాడు. తాను కృష్ణ సోదరిని వేధింపులకు గురి చేసేవాడినని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తనను బెదిరించాడని, అందుకే కోపంతో తన మిత్రుడు జగ్గాతో కలిసి కృష్ణను హత్య చేశారని తెలిపారు. 

అమెరికా ఉన్నతాధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ.. కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కాగా.. ఘటనా స్థలం నుంచి అవసరమైన అన్ని ఆధారాలను సేకరించినట్లు గోండా పోలీసులు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తెలిపారు. హత్యకు పాల్పడిన అనంతరం నిందితులు కృష్ణ ఇంట్లో నుంచి రూ.2,300 ఎత్తుకెళ్లారని చెప్పారు. నిందితులపై హత్యా సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అరెస్టు చేశామని అన్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 

click me!