ఓ ఆకతాయి చేసిన పని వల్ల ఓ బాలిక ప్రాణం పోయింది. స్కూల్ ముగించుకొని ఇంటికి వస్తున్న ఆమె చున్నీని ఓ యువకుడు లాగాడు. దీంతో ఆ బాలిక సైకిల్ పై నుంచి కిందపడిపోయింది. వెనకాల నుంచి వచ్చిన ఓ బైక్ ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది.
ఆ బాలిక ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లింది. బడి ముగిసిన వెంటనే సైకిల్ పై తన ఇంటికి తిరిగి బయలుదేరింది. సరదాగా తన స్నేహితురాలితో కలిసి, మాట్లాడుకుంటూ సైకిల్ తొక్కుతూ ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో ఓ ఆకతాయి చేసిన పనికి ఆమె ప్రాణం పోయింది. క్షణాల్లోనే ఇదంతా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రధానికి నేరుగా బర్త్ డే విషెస్ చెప్పే ఛాన్స్.. నమో యాప్ లో ‘ఎక్స్ ప్రెస్ యువర్ సేవా భావ్’ ప్రారంభం
ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ లో శనివారం ఈ ప్రమాదం జరిగింది. స్థానికంగా నివాసం ఉండే పూజ (14) ఓ పాఠశాలలో చదువుతోంది. ఎప్పటిలాగే శనివారం కూడా స్కూల్ కు వెళ్లింది. క్లాసులన్నీ అయిపోయిన తరువాత ఇంటికి సైకిల్ పై బయలుదేరింది. తన స్నేహితురాలితో కలిసి మాట్లాడుకుంటూ, సైకిల్ తొక్కుతూ రోడ్డుకు ఒక పక్కగా వస్తోంది. అయితే వీరిని కొంత దూరం నుంచి బైక్ పై ఇద్దరు యువకులు ఫాలో అవుతున్నారు.
Tragic incident that took place in Ambedkar Nagar district of Uttar Pradesh on September 15, 2023. A 14-year-old Hindu girl named Pooja was returning from school on her bicycle when two Muslim boys on a bike tried to snatch her dupatta. She lost her balance and fell on the road,… pic.twitter.com/NmJgVhphBM
— News Hrs (@newshrstweet)ఓ ప్రాంతానికి చేరుకునే సరికి ఆ బాలిక సైకిల్ ను ఆ ఆకతాయిలు ఓవర్ టేక్ చేశారు. ఈ క్రమంలో వెనకాల ఉన్న ఓ ఆకతాయి పూజ చున్నీని లాగాడు. దీంతో ఆమె అదుపుతప్పి రోడ్డు మధ్యలోకి వెళ్లి పడిపోయింది. అదే సమయంలో వెనకాల నుంచి వేగంగా వచ్చిన ఓ టూవీలర్ ఆ బాలికను ఢీకొట్టింది. పూజ తలపై నుంచి ఆ బైక్ వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ బైక్ కూడా అదుపుతప్పి కింద పడిపోయింది.
బ్రెజిల్ లోని అమెజాన్ లో కూలిన విమానం.. 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మృతి
అయితే ఈ ఘటన ఎదురుగా వస్తున్న మరో బైక్ కూడా ప్రమాదం బారిన పడింది. కాగా.. పూజ కింద పడిపోగానే.. ఆమె స్నేహితురాలు సైకిల్ ఆపేసి వేగంగా, కంగారుపడుతూ బాధితురాలివైపు పరిగెత్తింది. చుట్టుపక్కల వారు కూడా అక్కడికి వెంటనే చేరుకున్నారు. దీనిపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనలో మొత్తంగా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని కామెంట్లు పెడుతున్నారు.