గ‌తేడాది రికార్డు స్థాయిలో 1.64 ల‌క్ష‌ల మంది ఆత్మ‌హ‌త్య.. వివ‌రాలు వెల్ల‌డించిన ఎన్ సీఆర్బీ

By team teluguFirst Published Sep 5, 2022, 1:34 PM IST
Highlights

కరోనా మహమ్మారి మనుషుల జీవితాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి దేశం ఎన్నో నష్టాలను చూస్తోంది. అప్పటి నుంచే వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గతేడాది దేశంలో ఎన్నడూ లేనంత మంది బలవన్మరణం చెందారు.

కార‌ణాలు ఏవైనా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ప్ర‌తీ ఏటా జీవితాన్ని అర్ధాంత‌రంగా వ‌దిలేసి వెళ్లిపోయే వారి అధిక‌మ‌వుతోంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పోయిన సంవ‌త్స‌రం దేశంలో అధిక సంఖ్య‌లో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి. 2021లో సంవ‌త్స‌రంలో ఆత్మహత్యల కారణంగా 1.64 లక్షల మరణాలు న‌మోదు అయ్యాయి. అంటే సగటున రోజుకు దాదాపు 450 లేదా ప్రతి గంటకు 18 మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. 

జ‌నాభా నియంత్ర‌ణ‌పై జైశంకర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఇంత‌కీ ఏమన్నారంటే..?

ఇప్పటివరకు ఏ క్యాలెండర్ సంవత్సరంలోనూ ఇన్ని సూసైడ్ లు జ‌ర‌గ‌లేద‌ని ఈ గణాంకాలు చేరుకున్నాయి. ఆత్మహత్యతో మరణించిన వారిలో దాదాపు 1.19 లక్షల మంది పురుషులు, 45,026 మంది మహిళలు, 28 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  తెలిపింది. ఈ మేర‌కు ‘భారత్‌లో ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు - 2021’ అనే పేరుతో  ఒక నివేదిక విడుదల చేసింది. ఈ NCRB హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ప‌ని చేస్తుంది.

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తికి ముందు సంవత్సరాలతో పోలిస్తే 2020, 2021లో ఇలాంటి మ‌ర‌ణాల్లో గణనీయమైన పెరుగుదల న‌మోదైంద‌ని నివేదిక తేట‌తెల్లం చేసింది. 2020లో దేశవ్యాప్తంగా 1.53 లక్షల మంది ఆత్మహత్యల ద్వారా మరణించారని పేర్కొంది. 2019లో ఆత్మహత్యల సంఖ్య 1.39 లక్షలు, 2018లో 1.34 లక్షలు, 2017లో 1.29 లక్షలు, 2020, 2021లో 1.50 లక్షల మార్కుకు పెరిగాయని నివేదిక వెల్లడించింది.

ల‌క్నోలోని హోట‌ల్ లో అగ్ని ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి, ఏడుగురికి గాయాలు.. కొనసాగుతున్న రెస్క్యూ

ఎన్‌సీఆర్‌బీ 1967 నుండి ఈ ర‌క‌మైన మ‌ర‌ణాల‌ను న‌మోదు చేస్తూ వ‌స్తోంది. ఆ ఏడాది దేశంలో 38,829 ఆత్మ‌హ‌త్య‌లు సంభ‌వించాయ‌ని డేటా పేర్కొంది. 1984లో దేశంలోనే తొలిసారిగా ఆత్మహత్యల సంఖ్య 50,000 మార్కును దాటింది. 1991లో అది 75,000 మార్కును దాటినట్లు అప్ప‌టి లెక్క‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. 

9 నిమిషాల్లో 20 కిలో మీటర్లు.. ప్ర‌మాద‌ సమయంలో సైరస్ మిస్త్రీ చేసిన త‌ప్పదేనా?

అయితే 1998లో ఆత్మహత్యల సంఖ్య లక్ష దాటింది. ఆ సంవత్సరం 1.04 లక్షల మరణాలు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ వృత్తిపరమైన లేదా వృత్తిపరమైన సమస్యలు, ఒంటరితనం, దుర్వినియోగం, హింస, కుటుంబ సమస్యలు, మానసిక రుగ్మతలు, మద్యానికి వ్యసనం, ఆర్థిక నష్టం, దీర్ఘకాలిక నొప్పులు వంటి వివిధ కారణాల వల్ల ఈ ఆత్మహత్యలు జరిగాయి ’’ అని NCRB 2021 తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ ఎన్‌సీఆర్‌బీ కూడా పోలీసులు నమోదు చేసిన ఆత్మహత్య కేసుల ఈ డేటాను సేక‌రిస్తుంటుంది. 

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు. 
 

click me!