వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఉచితం..!

Published : Apr 10, 2021, 01:57 PM IST
వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఉచితం..!

సారాంశం

 కోవిడ్ నియమాలు పాటించాలంటూ ప్రభుత్వాలు నెత్తీ నోరు మొత్తుకున్నా కూడా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. కనీసం వ్యాక్సిన్ వేయించుకోండి అన్నా కూడా చాలా మందికి ముందుకు రావడం లేదు.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ లక్షకు పైగా కేసులు నమోదౌతున్నాయి. కోవిడ్ నియమాలు పాటించాలంటూ ప్రభుత్వాలు నెత్తీ నోరు మొత్తుకున్నా కూడా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. కనీసం వ్యాక్సిన్ వేయించుకోండి అన్నా కూడా చాలా మందికి ముందుకు రావడం లేదు.

మరోవైపు మరణాల సంఖ్యా గణనీయంగానే ఉంది. అయినప్పటికీ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో గుర్గావ్‌లోని ఓ రెస్టారెంట్ వినూత్న ఆఫర్ ప్రకటించింది. `టీకా లగావో, బీర్‌ లేజావో` అంటూ టీకా వేయించుకున్న వారికి బీర్ ఉచితంగా ఇస్తామని బంపరాఫర్ ప్రకటించింది. 

హార్యానాలోని గుర్గావ్‌లోని ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ ఈ ఆఫర్‌ ప్రకటించింది. టీకా వేసుకున్న తరువాత ఆ టీకా కార్డు చూపిస్తే ఉచిత బీరును ఆఫర్ చేస్తోంది. ఏప్రిల్ 5 నుంచి వారం రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. టీకాలు వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్టు రెస్టారెంట్ యజమాన్యం తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్