మంచి పనులు చేసే వ్యక్తికి గౌరవం దక్కదు - నితిన్ గడ్కరీ

By Sairam IndurFirst Published Feb 7, 2024, 10:56 AM IST
Highlights

మంచి పనులు చేసిన వారికి గౌరవం దక్కదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (union minister nitin gadkari) అన్నారు. భావాజాలన్ని అంటిపెట్టుకునే నాయకులు కరువయ్యారని చెప్పారు. అవకాశవాదులు రూలింగ్ పార్టీతో అంటకాగుతున్నారని చెప్పారు. ఢిల్లీలో పార్లమెంటీయన్లకు ఓ మీడియా సంస్థ అందించిన అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచి పనితీరు కనబరిచిన వారికి తగిన గుర్తింపు లభించడం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఎవరినీ ఉద్దేశించి చేసినవి కావని ఆయన స్పష్టం చేశారని  వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో పేర్కొంది.

బీజేపీ పడక గదుల్లోకి కూడా వచ్చేసింది - ఉత్తరాఖండ్ యూసీసీపై ప్రతిపక్షాల కామెంట్స్..

Latest Videos

‘‘నేను ఎప్పుడూ ఇవి సరదాగా చెబుతుంటాను. అది ఏ పార్టీ, ప్రభుత్వమైనా సరే, మంచి పనులు చేసేవాడికి ఎప్పటికీ గౌరవం దక్కదు. చెడు పనులు చేసేవారికి ఎప్పటికీ శిక్ష పడదు’’ అని అన్నారు. అవకాశవాద నేతలు అధికార పార్టీతో అంటకాగడంపై గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. తమ భావజాలం ఆధారంగా దృఢ సంకల్పంతో నిలబడే వారు ఉన్నారని, కానీ అలాంటి వారి సంఖ్య తగ్గుముఖం పడుతోందన్నారు. భావజాలం క్షీణించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

అవును.. బిస్కెట్ ను కుక్క యజమానికి ఇచ్చాను.. అందులో తప్పేముంది - వైరల్ వీడియోపై రాహుల్ గాంధీ

పార్లమెంటేరియన్లకు అవార్డులు ప్రదానం చేసేందుకు లోక్ మత్ మీడియా గ్రూప్ అనే మరాఠీ వార్తా సంస్థ ఢిల్లీలో కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీనికి హాజరై ప్రసంగిస్తున్న సమయంలో నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చల్లో అభిప్రాయ భేదాలు సమస్య కాదని స్పష్టం చేశారు. ఆలోచనలు లేకపోవడమే అసలు సమస్య అని వ్యాఖ్యానించారు.

రెస్క్యూ టీంను ముప్పు తిప్పలు పెట్టిన ఎలుగుబంటి.. 8 గంటల ఆపరేషన్ ఎలా సాగిందంటే ?

‘‘మేము రైటిస్ట్ లేదా లెఫ్టిస్ట్ కాదు. కొంత మంది మమ్మల్ని అవకాశవాదులని రాస్తారు. అందరూ అధికార పార్టీతో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు.’’ అని అన్నారు. పాపులారిటీ, పబ్లిసిటీ ముఖ్యమే అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంటేరియన్లు చేసిన పని కూడా కీలకమేనని, ప్రజల్లో వారికి గౌరవం లభిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. పార్లమెంటులో ఏం మాట్లాడతారనే దానికంటే ఆయా నియోజకవర్గాల్లో ప్రజల కోసం ఎలా పనిచేస్తారనేది ముఖ్యమని గడ్కరీ అన్నారు.

హైస్పీడ్ ఏరియల్ టార్గెట్ ‘అభ్యాస్’ ప్రయోగం సక్సెస్.. దీంతో ఉపయోగాలు ఏంటంటే ?

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వాక్చాతుర్యాన్ని ప్రశంసించిన గడ్కరీ.. మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ ప్రవర్తన, నిరాడంబరత, వ్యక్తిత్వం నుంచి తాను చాలా నేర్చుకున్నానని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తర్వాత తనను ఎంతగానో ఆకట్టుకున్న వ్యక్తి జార్జి ఫెర్నాండెజ్ అని ఆయన అన్నారు. ఇటీవల మరణానంతరం భారతరత్న అందుకున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి వ్యక్తులు దేశ ప్రజాస్వామ్యం బలంగా ఉండేలా చూశారని అన్నారు.

click me!