ముందు టైర్లు కూడా లేకుండా... బండి ఎలా నడిపావు సామీ.. వైరల్ వీడియో..!

Published : Jan 04, 2023, 09:45 AM IST
 ముందు టైర్లు కూడా లేకుండా... బండి ఎలా నడిపావు సామీ.. వైరల్ వీడియో..!

సారాంశం

ఆ ట్రక్కుకి కనీసం ముందు చక్రాలు కూడా లేవు. అయినా.... ఆ వాహనంతో రోడ్డు మీదకు వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో.... ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో కి 4.8 మిలియన్ల  వ్యూస్ రావడం గమనార్హం.

బండి మొత్తం సక్రమంగా ఉంటేనే.... ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఊహించలేని రోజులు ఇవి. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా... పూర్తిగా డ్యామేజ్ అయిన ట్రక్కు తీసుకొని రోడ్డు ఎక్కాడు. ఆ ట్రక్కుకి కనీసం ముందు చక్రాలు కూడా లేవు. అయినా.... ఆ వాహనంతో రోడ్డు మీదకు వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో.... ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో కి 4.8 మిలియన్ల  వ్యూస్ రావడం గమనార్హం.

ఇది ఎక్కడ జరిగింది అనేది క్లారిటీ లేదు కానీ.... వీడియో మాత్రం వైరల్ గా మారింది. ఫన్ జోన్ అనే పేజీలో ఈ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.  ట్రక్కుకు ముందు ఎలాంటి చక్రాలు లేకపోయినా ఎలాంటి టెన్షన్ లేకుండా డ్రైవర్ చాలా స్మూత్ గా ట్రక్కును నడపడం విశేషం. ఈ వీడియోని చూసి నెటిజన్లు షాకౌతున్నారు. అసలు ఎలా సాధ్యమైందని నోరెళ్ల పెడుతున్నారు. కొందరేమో... ఇలాంటి ప్రమాదకరమైన డ్రైవింగ్ అవసరమా అని సీరియస్ అవుతున్నారు. ఇండియన్ డ్రైవర్ పవర్ అంటే ఇలానే ఉంటుందని మరొకరు కామెంట్ చేయడం విశేషం.

 

PREV
click me!

Recommended Stories

గుజరాత్‌లో వింత ఘటన అలల్లా ఎగసి పడుతున్న బావి నీళ్లు | Virparada village | Gujarat mysterious well
డాలర్లు వస్తాయి కానీ... అమెరికాలో అందరి బతుకూ ఇదే! | US vs India Minimum Wage | Asianet News Telugu