వ్యాపారంలో లాభాలు వస్తాయని మేనకోడలిని బలిచ్చిన వ్యాపారి.. పంజాబ్ లో ఘటన

నష్టాల్లో నడుస్తున్న వ్యాపారాలు లాభాల్లోకి రావాలంటే నరబలి ఇవ్వాలని ఓ తాంత్రికుడు ఓ వ్యాపారవేత్తకు సూచించాడు. దీనిని నమ్మి అతడు తన 11 ఏళ్ల మేనకోడలినే హతమార్చాడు. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది.

Google News Follow Us

వ్యాపారంలో లాభాలు వచ్చేందుకు ఓ వ్యక్తి తన పదేళ్ల మేనకోడలిని నరబలి ఇచ్చాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అమృత్ సర్ లోని ముదల్ గ్రామంలో జూలై 11న చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ప్రమేయం ఉన్న నలుగురిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు. తాంత్రికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఒంగోలులో గిరిజనుడిపై దారుణం.. చితకబాది, నోట్లో మూత్రం పోసి, మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని ఒత్తిడి.. వీడియో

వివరాలు ఇలా ఉన్నాయి. ముదల్ గ్రామంలో దల్బీర్ సింగ్ అనే వ్యక్తి  మిఠాయిల వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అలాగే ఇటీవల ఓ మ్యారేజ్ రిసార్ట్ ను కూడా అద్దెకు తీసుకొని నడిపిస్తున్నాడు. అయితే అందులో అతడికి నష్టాలు వస్తున్నాయి. అతడికి భార్య జస్బీర్ కౌర్, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే జస్పీర్ కౌర్ కొన్నాళ్లుగా ఓ స్వయం ప్రకటిత దేవుడి మాయలో పడింది. ఆ మాంత్రికుడు తనకు అతీంద్రియ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నమ్మించాడు. తనకు బ్లాక్ మ్యాజిక్ తెలుసని కూడా చెప్పడంతో ఆమె అతడికి ఆకర్శితురాలైంది. 

పొలంలో కరెంట్ షాక్ వచ్చిన భార్యాపిల్లలను కాపాడి.. అదుతప్పి స్టార్టర్ బాక్స్ పై పడి ఎంపీటీసీ భర్త మృతి

అయితే తను చేసే బ్లాక్ మ్యాజిక్ వల్ల వ్యాపారం లాభాల్లో నడుస్తుందని ఆ తాంత్రికుడు జస్పీర్ కౌర్ కు తెలిపాడు. నరబలి ఇవ్వాలని సూచించాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. దీనికి ఆయన అంగీకరించాడు. తన భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి ఇంటి పక్కనే ఉండే 11 ఏళ్ల తన మేనకోడలిని హతమార్చాడు.

మహిళతో బీజేపీ నేత కిరీట్ సోమయ్య న్యూడ్ వీడియో కాల్.. వైరల్.. ప్రతిపక్షాల విమర్శలు

అనంతరం డెడ్ బాడీని ఓ పెద్ద సంచిలో కుక్కి ఓ చీకటి గదిలో రహస్యంగా భద్రపరిచాడు. అనంతరం గ్రామం నుంచి పారిపోయారు. అయితే తమ బిడ్డ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు శునకాల సాయంతో ఆ చిన్నారి డెడ్ బాడీని గుర్తించారు. అనంతరం నలుగురి నిందితులను అరెస్టు చేశారు.  ఆ స్వయం ప్రకటిత దేవుడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఈ నరబలి ఘటన స్థానికలంగా కలకలం రేకెత్తించింది.