ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ హేర్ స్టైల్ చేసుకున్న వ్యక్తి వీడియో వైరల్

Published : Sep 16, 2021, 05:37 PM IST
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ హేర్ స్టైల్ చేసుకున్న వ్యక్తి వీడియో వైరల్

సారాంశం

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను పోలిన హేర్ స్టైల్ చేసుకున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. హేర్ స్టైలిస్ట్ మంచి నైపుణ్యంతో సరిగ్గా అదే స్టైల్‌ను దించారు. తన ముఖాన్ని చూసుకుని కటింగ్ చేసుకున్న వ్యక్తి విరగబడి నవ్వుతూ వీడియోలో కనిపించారు.  

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ఎంత ఫేమస్సో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా అంతే ఫేమస్. ఆయన ఆహర్యం, నిర్ణయాలు, అగ్రరాజ్యానికి హెచ్చరికలు వెరసి కిమ్ గ్లోబల్ ఫిగర్‌గా కొనసాగుతున్నారు. కిమ్ జోంగ్ ఉన్‌ను చూసినప్పుడు ఆయన హేర్ స్టైల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తాజాగా ఓ వ్యక్తి హేర్ స్టైల్‌లో కిమ్ జోంగ్ ఉన్‌‌ను ఫాలో అయ్యారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగవైరలైపోతున్నది. వీడియో చూసిన వారూ కామెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారు.

 

వీడియోలో హేర్ స్టైలిస్ట్‌ కూడా కనిపిస్తున్నాడు. ఉత్తర కొరియా అధ్యక్షుడి హేర్ స్టైల్ చేయాలని చెప్పగానే అచ్చుగుద్దినట్టు దించేశాడు. కటింగ్ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి తనను తాను చూసుకుంటూ విరగబడి నవ్వారు. ఆయన వెనుకే ఉన్న హేర్ స్టైలిస్ట్ కూడా నవ్వారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆయన అచ్చంగా కిమ్‌ను పోలినట్టే ఉన్నాడని, ఆయనకు డమ్మీ రోల్‌గా ఉండవచ్చని ఇంకొందరు కామెంట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?