
పాపం...ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఓ వ్యక్తి తన ప్రాణాలు తీసుకోడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఓ సారి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించి విఫలమై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరోసారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈసారి ప్రయత్నంలో అతడు తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన చత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది.
కాంకెర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చేతి మణికట్టు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించగా గమనించిన కుటుంబసభ్యులు కాపాడి ఆస్పత్రిలో చేర్చారు. అయితే బ్రతకడం ఏమాత్రం ఇష్టం లేని అతడు కాస్త కోలుకున్నాక మరోసారి ఆస్పత్రిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తు పైనుండి దూకాడు. దీంతో ఈసారి ప్రాణాలను కోల్పోయాడు.
చికిత్స పొందుతున్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది అక్కడికి వచ్చి చూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.