జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీలో పేలిన మందుపాతర.. ఆర్మీ జవాన్ కు గాయాలు

Published : Oct 15, 2023, 04:19 PM IST
జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీలో పేలిన మందుపాతర.. ఆర్మీ జవాన్ కు గాయాలు

సారాంశం

జమ్మూకాశ్మీర్ లో విషాదం చోటు చేసుకుంది. మందుపాతర పేలడంతో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం రాజౌరీ జిల్లాలోని ఎల్ వోసీ వద్ద చోటు చేసుకుంది. గత వారం కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది.

జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ వోసీ) సమీపంలో ఆదివారం మందుపాతర పేలింది. దీంతో ఓ సైనికుడు గాయపడ్డాడు. బాధితుడిని రైఫిల్ మెన్ గురుచరణ్ సింగ్ గా గుర్తించారు. ఆయన పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా నౌషేరా సెక్టార్ లోని ఫార్వర్డ్ కల్సియాన్ గ్రామంలో ప్రమాదవశాత్తు మందుపాతరపైకి కాలు పెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ దేశంలో బతకాలంటే ‘భారత్ మాతాకీ జై’ అనాల్సిందే - కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి

దీంతో సైనికులు ఆయనను సమీపంలోని మిలటరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఉధంపూర్ కమాండ్ ఆసుపత్రికి తరలించారు. కాగా.. చొరబాట్ల నిరోధక వ్యూహంలో భాగంగా సాయుధ ఉగ్రవాదులు ఈ వైపు ప్రవేశించకుండా నిరోధించడానికి సైన్యం మందుపాతరలను ఉపయోగిస్తోంది. కొన్నిసార్లు వర్షం కారణంగా పేలుడు పరికరాలు స్థానభ్రంశం చెందుతాయి. ఇవి ప్రమాదవశాత్తు పేలుళ్లకు కారణమవుతున్నాయి. 

వారం రోజుల కిందట ట ఇదే రాజౌరీ ప్రాంతంలో మందుపాతర పేలడంతో ఇద్దరు ఆర్మీ పోర్టర్లు గాయపడ్డారు. గత శనివారం నౌషెరా సెక్టార్ లోని ఫార్వర్డ్ కలాల్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. మంగియోటే గ్రామానికి చెందిన రాజ్ కుమార్, అశ్వనీ కుమార్ లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చొరబాట్ల నిరోధక వ్యవస్థలో భాగంగా ఫార్వర్డ్ ప్రాంతాలు మందుపాతరలతో నిండిపోయాయని, అవి కొన్నిసార్లు వర్షాలకు కొట్టుకుపోతాయని, ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు ఆ సమయంలో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu