కుష్టువ్యాధి కారణంగా వారిని కుటుంబాలు వదిలేశాయి.. కోలుకున్నాక 60 ఏళ్ల వయసులో వివాహం

By Mahesh K  |  First Published Oct 15, 2023, 3:37 PM IST

ఆమె పదేళ్లపాటు కుష్టు వ్యాధికి చికిత్స తీసుకుంది. భర్త మరణించినా.. ఉన్న కుటుంబం కూడా ఆమెను పట్టించుకోలేదు. ఆమెను ఒంటరిని చేసింది. అదే లెప్రసీ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌లో నాలుగేళ్లు చికిత్స పొందిన ఆయన పరిస్థితి కూడా అదే. ఒంటరిగా మారిన వారిద్దరూ ఒకరిలో మరొకరిని తోడు వెదుక్కుతున్నారు. కుష్టు నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత 60 ఏళ్ల వయసులో తోటి పేషెంట్లు, హాస్పిటల్ స్టాఫ్ సమక్షంలో ఒక్కటయ్యారు.
 


బాలాసోర్: కుష్టు వ్యాధి ఉన్నదని తేలగానే ఆమెను ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్చారు. భర్త మరణించాడు. కానీ, ఆమె కుటుంబం మాత్రం మళ్లీ ఆమెను చూడరాలేదు. ఒంటరి చేసింది. ఆయన పరిస్థితీ అలాంటిదే. ఆమె పదేళ్లు పోరాడి కుష్టు వ్యాధిని జయిస్తే.. ఆయన నాలుగేళ్ల చికిత్స తర్వాత కోలుకున్నాడు. ఇద్దరికీ ఆ లెప్రసీ ట్రీట్‌మెంట్ సెంటర్‌లోనే పరిచయం. ఏకాకులైన ఇద్దరూ ఒకరి తోడులో మరొకరు సేద తీరారు. కష్ట సుఖాలు చెప్పుకున్నారు. భవిష్యత్ చూసుకున్నారు. ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. 60 ఏళ్ల వయసులో వారిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోనిది.

63 ఏళ్ల దాసా మరాండీ, 65 ఏళ్ల పద్మాబతిలు బాలాసోర్ జిల్లా రెమునా బ్లాక్‌లో బంపాడాలోని ప్రభుత్వ నిధులతో నడిచే లెప్రసీ ట్రీట్‌మెంట్ సెంటర్‌లో చికిత్స పొంది కుష్టు వ్యాధి నుంచి బయటపడ్డారు. వారిద్దరూ పూర్తిగా కోలుకున్నా కుటుంబాలు వారిని స్వీకరించలేవు. సాంప్రదాయ కుటుంబాల్లో ఇప్పటికీ కుష్టువ్యాధి పై అనేక అపోహలు ఉన్నాయని, మారిన పరిస్థితుల్లో వారిని మార్చుకునే స్థితిలో లేరని సోషల్ యాక్టివిస్ట్ నిరంజన్ పరిదా తెలిపారు.

Latest Videos

కుష్టు వ్యాధి ఉన్నదని తేలగానే దాసా మరాండీని కుటుంబం వదిలిపెట్టింది. లెప్రసీ ట్రీట్‌మెంట్ సెంటర్‌లోని మేల్ వార్డులో ఆయన నాలుగేళ్లపాటు చికిత్స పొందాడు. భర్త మరణించినా.. ఉన్న కుటుంబం కూడా పద్మాబతిని పరామర్శించరాలేదు. ఆమెను అందరు ఉన్న ఒంటరిని చేశారు. బంధువులు, ఆప్తులు వారిని వదిలిపెట్టారు. ఈ ఒంటరితనంలో వారిద్దరూ ఒకరితోడును మరొకరు పొందారు. ‘కొన్నేళ్లుగా మేం క్లోజ్‌గా ఉన్నాం. శేష జీవితంలోనూ కలిసుందామని నేనే ప్రతిపాదించాను. ఆమె అంగీకరించింది.’ అని దాసా మరాండీ చెప్పాడు. లెప్రసీ ట్రీట్‌మెంట్ సెంటర్‌లోని రిహాబిలిటేషన్ సెంటర్‌లో వారు ఉంటారు.

Also Read: దెయ్యం వదిలిస్తానని తల్లిదండ్రులను నమ్మించి యువతిపై అత్యాచారం

సమీప గుడిలో శుక్రవారం వారి పెళ్లి వేడుక జరిగింది. లెప్రసీ ట్రీట్‌మెంట్ సెంటర్ స్టాఫ్, తోటి పేషెంట్లు చిన్నస్థాయిలో కార్యక్రమం నిర్వహించారు. విందును కూడా ఏర్పాటు చేసినట్టు స్టాఫ్ దుర్గమని ఉపాధ్యాయ్ తెలిపారు. ‘వారిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. ఇతరుల్లాగే సంతోషమయ జీవితాన్ని వారు ఆస్వాదించవచ్చు’ అని డాక్టర్ మృత్యుంజయ్ మిశ్రా అన్నారు.

click me!