సెల్యూట్ తల్లీ.. వలస కార్మికురాలి బిడ్డకు పాలిచ్చి మానవత్వం చాటుకున్న మహిళా పోలీసు

By Asianet NewsFirst Published Nov 24, 2023, 5:33 PM IST
Highlights

ఓ మహిళా పోలీసు మానవత్వం చూపించారు. మానవత్వంతో ఓ పసికూన ఆకలి తీర్చారు. ఆకలితో అలమటిస్తున్న నాలుగు నెలల చిన్నారికి తన చనుబాలు ఇచ్చి తల్లి మనస్సును చాటుకున్నారు.

ఓ మహిళా పోలీసు మానవత్వం చాటుకున్నారు. ఓ నాలుగు నెలల చిన్నారి పాల కోసం ఏడుస్తుంటే ఆమె తట్టుకోలేకపోయారు. విధుల్లో ఉన్న సమయంలో ఆ చిన్నారికి పాలిచ్చి ఆకలి తీర్చారు. ఆమె గొప్ప మనసును ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూజర్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

ఘోరం.. 142 మంది బాలికపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి..

Latest Videos

అసలేం జరిగిందంటే ? 
బీహార్ కు చెందిన ఓ కుటుంబం కేరళలోని కొచ్చికి వలస వచ్చింది. ఇక్కడ కూలీ పనులు చేసుకొని ఆ కుటుంబం జీవిస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ కుటుంబ పెద్ద కొంత కాలం కిందట జైలుకు వెళ్లారు. అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఇందులో పెద్ద కూతురుకు 13 సంవత్సరాల వయస్సు కాగా.. ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కూతురు ఉంది. నాలుగు నెలల కిందట మరో కూతురు జన్మించింది.

 

పిల్లలను చూసుకుంటూ తల్లి జీవిస్తోంది. అయితే సిజేరియన్ ఆపరేషన్ అనంతరం ఆమెకు శ్వాసకోశ సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఆమె చికిత్స కోసం గురువారం ఎర్నాకుళం జనరల్ హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం కుటుంబాన్ని పోషిస్తున్న తల్లి హాస్పిటల్ లో చేరడంతో పిల్లలకు ఆహారం ఇచ్చేవారు కరువయ్యారు. ఈ విషయం ఎర్నాకుళం వనిత పోలీసులకు తెలిసింది. దీంతో వారంతా ఆ హాస్పిటల్ కు చేరుకున్నారు. పిల్లలందరినీ వెంటనే స్టేషన్ కు తీసుకొచ్చారు. ముగ్గురు పిల్లలకు ఆహారం అందించారు. కానీ.. నాలుగు నెలల పసికందుకు మాత్రం ఆహారం అందించలేకపోయారు. 

విషాదం.. నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి.. మరొకరికి గాయాలు..

అదే పోలీసు స్టేషన్ లో సివిల్ పోలీస్ ఆఫీసర్ గా ఆర్య అనే మహిళ పని చేస్తున్నారు. ఆమెకు ఇటీవలే ప్రసూతి సెలవుల నుంచి తిరిగి విధుల్లో చేరారు. అయితే నాలుగు నెలల పసికూన ఆకలితో ఏడుస్తోందని ఆమెకు తెలిసింది. దీంతో ఆమెలోని తల్లి మనస్సు చలించిపోయింది. మానవత్వంతో ఆ చిన్నారికి పాలివ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. దీంతో ఆమెను పోలీసులు ఉన్నతాధికారులు, స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు. కాగా.. ఈ పిల్లల తల్లి ఆరోగ్య పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. బీహార్ లో ఆ కుటుంబం బంధువులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

click me!